కంపెనీలకు భారీగా సైబర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ రిస్క్‌‌‌‌‌‌‌‌ 

కంపెనీలకు భారీగా సైబర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ రిస్క్‌‌‌‌‌‌‌‌ 

న్యూఢిల్లీ: భారతదేశంలోని 5 శాతం కంటే తక్కువ కంపెనీలు మాత్రమే సైబర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ రిస్క్‌‌‌‌‌‌‌‌లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మిగతా 95 శాతం కంపెనీలకు ముప్పు పొంచి ఉంది. రాబోయే 12-–24 నెలల్లో వీటిపై సైబర్​దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. గురువారం విడుదలైన 2024 సిస్కో సైబర్‌‌‌‌‌‌‌‌సెక్యూరిటీ రెడీనెస్ ఇండెక్స్ ప్రకారం..

భారతదేశంలో కేవలం 4 శాతం కంపెనీలు మాత్రమే ఇట్లాంటి బెదిరింపులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి.  59 శాతం సంస్థలు ఇప్పుడిప్పుడే దాడులను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, 3 శాతం కంపెనీలు మాత్రం పూర్తిస్థాయిలో దాడులను ఎదుర్కోగల సత్తాను సంపాదించుకున్నాయి. ఈ కంపెనీలు దాడులకు వ్యతిరేకంగా పటిష్ట ఏర్పాట్లు చేసుకున్నాయి.