కాళేశ్వరం నీళ్లివ్వాలని రైతుల రాస్తారోకో

కాళేశ్వరం నీళ్లివ్వాలని రైతుల రాస్తారోకో

కొండపాక (కొమురవెల్లి), వెలుగు : సీఎం నియోజకవర్గమైన కొండపాక మండలంలోని బందారం దర్గా, అంకిరెడ్డిపల్లి గ్రామాలకు కాళేశ్వరం నీళ్లివ్వాలని రైతులు, గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేశారు. దుద్దెడలోని జనగాం క్రాసింగ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండలంలోని బందారం, అంకిరెడ్డిపల్లి గ్రామాలకు కాళేశ్వరం నీళ్లివ్వాలని ఆరేండ్లుగా అధికారులను వేడుకుంటున్నా.. ఇప్పటి వరకు కాలువలు నిర్మించలేదన్నారు. 

చుట్టుపక్కల గ్రామాలకు కాలువల ద్వారా నీళ్లిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారన్నారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు అక్కడికి వచ్చి ఆందోళనకారులను అరెస్ట్​ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సర్పంచులు శ్రీనివాస్ కర్ణాకర్ రెడ్డి, అంకిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బడే కోల్ నరసింహులు, ఉప సర్పంచ్ నరసింగరావు, పాలడుగు చంద్రారెడ్డి, మిట్టపల్లి రాజు, కట్ట రాజు, వార్డు సభ్యులు నీరసత్యం, బట్ట పరశురాములు, శనిగరం మల్లయ్య, నీల వెంకటేశ్, వేణు, చింతల యాదగిరి, పరశురాములు, శ్రీనివాస్, యాదగిరి, కిషన్ రావు, నరసింహులు, తిరుమల్ రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.