V6 News

గంగూలీ కోసం ప్రార్ధనలు చేద్దాం

గంగూలీ కోసం ప్రార్ధనలు చేద్దాం
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఛాతీలో నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించాలని డాక్టర్లు నిర్ణయించారు.  ఈ క్రమంలో, మాజీ నటి, కాంగ్రెస్ మహిళా నేత నగ్మా స్పందించారు. గంగూలీ… నువ్వు త్వరగా ఆరోగ్యవంతుడివి కావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. గంగూలీ వేగంగా కోలుకోవాలని, ఆయన కోసం మరిన్ని ప్రార్థనలు చేద్దామని తెలిపారు. గతంలో సౌరవ్ గంగూలీ టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించిన సమయంలో నగ్మాతో అనుబంధం ఏర్పడిందంటూ వార్తలొచ్చాయి. 2003 ఆస్ట్రేలియా టూర్ ముగిసిన తర్వాత గంగూలీ, నగ్మా కలసి తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వచ్చి సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నట్టు ప్రచారం జరిగింది. ఓ దశలో గంగూలీ… నగ్మాను పెళ్లాడతాడని భావించారు. అయితే, తన చిన్ననాటి నేస్తం, శాస్త్రీయ నృత్య కళాకారిణి డోనాను గంగూలీ వివాహం చేసుకోవడంతో.. నగ్మా ఇప్పటికీ అవివాహితగానే ఉన్నారు.