ఈ ఏడాది మొదటి చంద్ర గ్రహణాన్ని చూద్దాం ఇలా..

ఈ ఏడాది మొదటి చంద్ర గ్రహణాన్ని చూద్దాం ఇలా..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మే 5 న జరగబోతోంది. ఇదే రోజు వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమలు కూడా ఉన్నాయి. ఈ చంద్ర గ్రహణం రాత్రి 8.45కి ప్రారంభమై అర్ధరాత్రి 1.02కి ముగుస్తుంది. 

ఇలా ఏర్పడుతుంది.. 

సైన్స్​ ప్రకారం సూర్యుడు, భూమి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.  పెనుంబ్రల్​ చంద్రగ్రహణం సమయంలో, చంద్రుడు భూమి నీడ వెలుపలి భాగం వెంట కదులుతాడు. దీంతో చంద్రుడిని చీకటి అలుముకుంటుంది. సంపూర్ణ, పాక్షిక చంద్ర గ్రహణం సమయంలో వలె కాకుండా పెనుంబ్రల్​ గ్రహణ సమయంలో చంద్రుడు రంగు మారినట్లు కనిపించదు.

పెనుంబ్రల్​ చంద్రగ్రహణం అంటే...

సంపూర్ణ గ్రహణ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడి దానిని ఎరుపుగా మారుస్తుంది. దీనినే పెనుంబ్రల్ చంద్ర గ్రహణం అంటారు.

ఇండియాలో కూడా కనిపిస్తుందా?

ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్​లోని చాలా ప్రాంతాల్లో రాత్రి 10.52 గంటలకు పెనుంబ్రల్​ చంద్రగ్రహణాన్ని చూడగలరు. ఈ గ్రహణాన్ని ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే నేరుగా చూడవచ్చు. అయినా దీని ప్రభావం చాలా తక్కువగా ఉండటంతో, కంటి జబ్బులు ఉన్నవారు నేరుగా చూడలేకపోవచ్చు.