రికార్డు స్థాయిలో ఓటేయ్యాలె.. ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చెయ్యాలె : ప్రధాని

రికార్డు స్థాయిలో ఓటేయ్యాలె.. ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చెయ్యాలె : ప్రధాని

అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నట్టు ఆయన ఎక్స్ ద్వారా తెలిపారు.
 
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఒక్కొక్కరు క్యూ లైన్లలో నిలబడి వచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయా పోలింగ్ బూత్ లలో ఓటు వేశారు.