లెటర్ టు ఎడిటర్.. అయోధ్య రాముడినికొలుద్దాం

లెటర్ టు ఎడిటర్.. అయోధ్య రాముడినికొలుద్దాం

495 ఏండ్ల పోరాటం నాలుగు తరాల ఆశ నలభై ఏండ్ల మన స్వాభిమానం నిజమయ్యే రోజు రానే వచ్చింది. అందరికీ రోల్ మోడలైన  శ్రీరాముని మందిర నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవ వేడుకల్లో అందరు కూడా పాలుపంచుకొవాలి. 15వ తారీకు వరకు  కూడా శ్రీరాముని అక్షింతలు పంపిణీ ఒక దీక్షగా సాగుతున్నది.   చెప్పులు వేసుకోకుండా కాషాయ కండువా ధారణ చేసుకొని అక్షింతలు పంపిణీ చేయడానికి భక్తులు వస్తారు. దేశంలోని ప్రతి రామభక్తునికి గొప్ప అవకాశం. మన స్వాభిమానానికి చిహ్నమైన  అయోధ్య రామ మందిర్ నిర్మించడం జరిగింది. ఎంతోమంది ఆత్మబలిదానంతో ఎన్నో పోరాటాల తర్వాత ఎంతోమంది ఆశల ఫలితమే ఈ రోజున మనం చూసే ఈ రామ్ మందిర్.  రామ్ మందిర్ జనవరి 22న  ప్రధాన మంత్రి మోదీ చేత ప్రారంభించబడుతుంది. అందరూ కూడా ఈ ప్రారంభోత్సవాల్లో భాగస్వామ్యం కావాలి. జనవరి 22న ప్రతి ఇంట్లో  రాముని పూజిస్తూ మన స్వాభిమానాన్ని చాటుకొవాలి.

- సంగెం సంహిత్ రెడ్డి