గే, ట్రాన్స్ జెండర్స్ జీవితాలపై దర్శకనిర్మాత పి. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన కోర్ట్ రూమ్ డ్రామా ‘ఎల్ జి బీ టీ - ఏ లీగల్ బ్యాటిల్’. సుభాష్ చక్రవర్తి రవడ కో ప్రొడ్యూసర్. ఎల్ బి శ్రీరామ్, ఎస్తర్, రాజు ఖేర్, ఆనంద చక్రపాణి , ప్రీతీ నిగమ్‌తో పాటు రియల్ ట్రాన్స్ జెండర్స్ నటించారు. ఈ నెల 19న సినిమా రిలీజ్. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ‘ట్రాన్స్ జెండర్స్ ఎదుర్కొంటున్న వివక్షపై తీసిన సినిమా ఇది.
వాళ్లపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా కోర్టుల దాకా వెళ్లి శిక్షలు పడటం లేదు. ఫస్ట్ టైమ్ ఒక ట్రాన్స్ జెండర్ కేసులో పూర్తి న్యాయం జరిగినట్లు మా సినిమాలో చూపిస్తున్నాం. కేవలం మల్టిప్లెక్స్‌ల్లో రిలీజ్ చేస్తున్నాం’ అని చెప్పారు. తెలంగాణ ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైలా, సోషల్ మీడియా యాక్టివిస్టులు హిమ రాథోడ్, సనాఖాన్, గే కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ విష్ణు పాల్గొన్నారు.
