
ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ లియామ్ మెక్‌కార్తీకి తన తొలి మ్యాచ్ పీడకలగా మిగిలింది. వెస్టిండీస్ బ్యాటర్ల విధ్వంసానికి బలయ్యాడు. ఆదివారం (జూన్ 15) వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారీగా పరుగులు ఇచ్చాడు. బ్రెడీలోని బ్రెడీ క్రికెట్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో తన నాలుగు ఓవరాల్ స్పెల్ లో ఏకంగా 81 పరుగులు సమర్పించుకున్నాడు. విండీస్ ఓపెనర్లు ఎవిన్ లూయిస్, కెప్టెన్ షాయ్ హోప్ ధాటికి కుదేలయ్యాడు. తొలి ఓవర్ నుంచి ఈ ఐరీష్ పేసర్ తన లైన్ అండ్ లెంగ్త్ విషయంలో ఇబ్బందిపడ్డాడు.
ఈ క్విక్ పేసర్ తన తొలి ఓవర్ లోనే 21 పరుగులు ఇచ్చాడు. రెండో ఓవర్లో (ఇన్నింగ్స్ 9) మరోసారి మెక్‌కార్తీని టార్గెట్ చేసిన విండీస్ ఓపెనర్లు 24 పరుగులు రాబట్టారు. చివరి రెండు ఓవర్లలో వరుసగా 18, 18 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఓవరాల్ గా 81 పరుగులతో అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్ లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా మెక్‌కార్తీ నిలిచాడు. ఇంతకముందు ఈ రికార్డ్ ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ ఆండర్సన్ పేరిట ఉంది. అండర్సన్ తన డెబ్యూ మ్యాచ్ లో 2007లో ఆస్ట్రేలియాపై 64 పరుగులు ఇచ్చాడు. ఈ రికార్డును ఈ ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఆదివారం బద్దలు కొట్టాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్ అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్ గా మెక్‌కార్తీ మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి స్థానంలో గాంబియాకు చెందిన ముసా జోబర్తే పేరిట ఉంది. జోబర్తే 2024లో జింబాబ్వేపై తన నాలుగు ఓవర్లలో 93 పరుగులు లీక్ చేశాడు. శ్రీలంకకు చెందిన కసున్ రజిత 2019లో ఆస్ట్రేలియాపై తన నాలుగు ఓవర్లలో 75 పరుగులు లీక్ చేసి మూడవ స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే వెస్టిండీస్ 64 పరుగుల తేడాతో ఐర్లాండ్ పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఐర్లాండ్ 20 ఓవర్లలో 194 పరుగులకే పరిమితమైంది.
Liam McCarthy won’t want to remember this one - 81 runs, the second most ever conceded in men’s T20Is 😳
— ESPNcricinfo (@ESPNcricinfo) June 15, 2025
Scorecard: https://t.co/CZv66CDigm pic.twitter.com/P5phkvuc1P