జడ్చర్లలో ఎల్ ఐసీ ఉద్యోగుల ధర్నా

జడ్చర్లలో ఎల్ ఐసీ ఉద్యోగుల ధర్నా

జడ్చర్ల, వెలుగు :  కార్మికుల హక్కులకు భంగం కలిగేలా తీసుకొచ్చిన లేబర్​ కోర్టులను రద్దు చేయాలని బుధవారం జడ్చర్ల పట్టణంలో ఎల్ఐసీ ఉద్యోగులు ధర్నా చేశారు. సీఐటీయు. ఏఐటీయూసీతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. గురువారం జరుగనున్న దేశవ్యాప్త సమ్మే విజయవంతం చేయాలని ఐక్యకార్యాచరణ నాయకులు పిలుపునిచ్చారు.

ఈ మేరకు జడ్చర్ల అంబేద్కర్​ కళాభవన్​లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, కార్యాచరణ రూపొందించినట్లు సీఐటీయూ జిల్లా నాయకులు ఆకుల వెంకటేశ్, కృష్ణ, తెలుగు సత్తయ్య, అనిల్​కుమార్​ తెలిపారు.