
హైదరాబాద్, వెలుగు: భారతదేశపు ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన ఎల్ఐసి ఆఫ్ ఇండియా (ఎల్‌సీఐ) బ్రిటిష్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూషన్ (బీఎస్ఐ) నుంచి ఐఎస్ఓ 22301:2019 బిజినెస్ కంటిన్యుటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్‌ను పొందింది.
ఈ గుర్తింపు ఎల్ఐసీ కార్యాచరణ సామర్థ్యం, బిజినెస్ కంటిన్యుటీ ప్లానింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్ సామర్థ్యాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ధ్రువీకరిస్తుందని ఎల్ఐసీ తెలిపింది. ఊహించని అంతరాయాలు ఎదురైనప్పటికీ నిరంతర సేవలను అందించగల సత్తా తమకు ఉందని పేర్కొంది.