హైదరాబాద్, వెలుగు: దంపతుల కోసం ఎల్‌ఐసీ రెండు కొత్త జీవిత బీమా పథకాలను ప్రవేశపెట్టింది. జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం పథకాలను ఎల్‌ఐసీ ఎండీ, సీఈఓ ఆర్. దొరైస్వామి ప్రారంభించారు.
ఇవి భార్యాభర్తలు ఇద్దరికీ ఒకే పాలసీలో రక్షణ కల్పించే జాయింట్ లైఫ్ సేవింగ్స్ పథకాలు. ఈ పథకాలలో కనిష్ట బీమా మొత్తం రూ. 3 లక్షలుగా నిర్ణయించారు.
కనీసం 18 ఏళ్ల వయసున్న వారు ఈ పథకాల్లో చేరవచ్చు. పాలసీ కాలపరిమితి ముగిసే వరకు కనీసం ఒకరు జీవించి ఉంటే, బీమా మొత్తంతో పాటు గ్యారెంటీడ్ అడిషన్స్ కూడా చెల్లిస్తారు.
మొదటి మరణం సంభవించినప్పుడు నిర్ణీత డెత్ బెనిఫిట్ అందిస్తారు. రెండవ మరణం జరిగినప్పుడు కూడా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.
