న్యూఢిల్లీ: ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2025-–26 ను ఎల్‌ఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (హెచ్‌ఆర్‌డీ, ట్రెయినింగ్) సలీల్ విశ్వనాథ్ లక్నోలోని కె.డి. సింగ్ బాబు స్టేడియంలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి లక్నో డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ సంజయ్ కుమార్ సింగ్, సెంట్రల్ ఆఫీస్ ముంబై హెచ్‌ఆర్‌డీ అండ్ ట్రెయినింగ్ కార్యదర్శి ఎస్. గాయత్రి, నార్త్ సెంట్రల్ జోన్ కాన్పూర్ హెచ్‌ఆర్‌డీ రీజినల్ మేనేజర్ అజయ్ కుమార్ మిశ్రా హాజరయ్యారు.
ఈ టోర్నమెంట్‌ను ఈ ఏడాది ఎల్‌ఐసీ నిర్వహిస్తోంది. ఎల్‌ఐసీతో సహా 13 పబ్లిక్ సెక్టార్ సంస్థల నుంచి సుమారు 120 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్ జనవరి 31 న ముగుస్తుంది.
