హైదరాబాద్, వెలుగు: ప్రొటెక్షన్ ప్లస్, బీమా కవచ్ పేరుతో ఎల్ఐసీ రెండు కొత్త ప్లాన్స్ను ప్రారంభించింది. ప్రొటెక్షన్ ప్లస్లో రక్షణతో పాటు పొదుపూ ఉంటాయి. పాలసీ తీసుకున్నంత కాలం జీవిత బీమా రక్షణ ఉంటుంది. పాలసీ హోల్డర్‌కు ఏమైనా జరిగితే, కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. కట్టిన డబ్బులో కొంత భాగాన్ని పెట్టుబడి పెడతారు. ఏ ఫండ్లో పెట్టుబడి పెట్టాలనేది కస్టమరే నిర్ణయించుకోవచ్చు.
బీమా కవరేజీని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఐదేళ్ల తర్వాత, అవసరమైతే కొంత డబ్బును తీసుకోవచ్చు. ప్రీమియం ఎంత కట్టాలనేది కస్టమరే నిర్ణయించవచ్చు. బీమా కవచ్ రిస్క్ కవర్ కోసం రూపొందించిన ప్లాన్. పాలసీ కాలంలో బీమా చేసిన వ్యక్తి మరణిస్తే, కుటుంబానికి పరిహారం చెల్లిస్తారు. ఇందులో పొదుపు, పెట్టుబడి ఉండదు. వందేళ్ల వరకు బీమా రక్షణ ఉండేలా టర్మ్‌ను ఎంచుకోవచ్చు.
