న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్‌ను చెల్లించింది. ప్రభుత్వ వాటాకు సంబంధించిన రూ.12,207.25 కోట్ల డివిడెండ్ చెక్కును సంస్థ సీఈఓ ఆర్. దొరైస్వామి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు బుధవారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శి సంజయ్ లోహియాతో పాటు ఎల్‌ఐసీ మేనేజింగ్ డైరెక్టర్లు రత్నాకర్ పట్నాయక్, ఆర్. చందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ఎల్‌ఐసీ తన కార్యకలాపాలు ప్రారంభించి 70 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. మార్చి 31, 2026 నాటికి సంస్థ మేనేజ్ చేస్తున్న ఆస్తుల విలువ ఏకంగా రూ.59.03 లక్షల కోట్లకు చేరుకుంది.
