దీపావళి పటాకుల షాపులకు లైసెన్స్ త ప్పనిసరి

దీపావళి పటాకుల షాపులకు లైసెన్స్ త ప్పనిసరి

హైదరాబాద్​ సిటీ, వెలుగు: దీపావళి సందర్భంగా పటాకుల దుకాణాలు నిర్వహించే వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. దుకాణాల లైసెన్స్​కోసం ఈ నెల 16లోపు cybpms.telangana.gov.in వెబ్​సైట్​లో దరఖాస్తు చేయాలని సూచించారు. డీసీపీ ఆధ్వర్యంలో అప్లికేషన్‌‌ పరిశీలించి లైసెన్స్‌‌ జారీ చేస్తామని, అనుమతి లేకుండా దుకాణాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.