దేశ రక్షణ దళాల(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) కొత్త బాస్ గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ స్థానంలో రాజు సుబ్రమణిని భారత ప్రభుత్వం నియమించింది. మే 30 తో జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగియనుండటంతో ఆయన స్థానంలో జనరల్ రాజా సుబ్రమణి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. జనరల్ రాజా సుబ్రమణి ప్రస్తుతం లెఫ్టినెంట్ జాతీయ భద్రతా మండలి సచివాలయం (NSCS)లో సైనిక సలహాదారుగా పనిచేస్తున్నారు. జనరల్ రాజా సుబ్రమణి 2025జూలై 31న ఆర్మీ వైస్ చీఫ్ గా సైన్యం నుంచి పదవీ విరమణ చేశారు.
భారత సైన్యంలో 39 ఏళ్ల పాటు సేవలందించారు రాజా సుబ్రమణి. ఆయన సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ గా కూడా పనిచేశారు. ఆయన విశిష్ట సేవకు గాను, లెఫ్టినెంట్ జనరల్ సుబ్రమణికి పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, సేనా పతకం,విశిష్ట సేవా పతకం అందుకున్నారు.
