
ముషీరాబాద్, వెలుగు: యువకులు ఆత్మగౌరవంతో జీవించగలిగే సామాజిక, ఆర్థిక పరిస్థితులున్న సమాజం రావాలని కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆకాంక్షించారు. ఆదివారం విద్యానగర్ని మార్క్స్ భవన్ లో ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్రస్థాయి జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా మాడభూషి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరై మాట్లాడారు. మద్యం, డ్రగ్స్మత్తు, మూఢనమ్మకాల వంటి విషయ వలయాలు యువకులను పక్కదారి పట్టిస్తున్నాయని తెలిపారు. వాటిని ఛేదించి, సమాజం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.హన్మేశ్మాట్లాడుతూ.. సామాజిక రుగ్మతలపై యువకులు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్, ప్రధాన కార్యదర్శి ఎస్.అజయ్, నాయకులు ప్రతాప్, ఎంవీ.రాకేశ్, ఎం.రవికుమార్,ఈశ్వర్ పాల్గొన్నారు.