హైదరాబాద్ బీరంగూడలోని క్లాత్ షోరూంలో తెగిపడ్డ లిఫ్ట్.. 11 మందికి తీవ్ర గాయాలు.

హైదరాబాద్ బీరంగూడలోని క్లాత్ షోరూంలో తెగిపడ్డ లిఫ్ట్.. 11 మందికి తీవ్ర గాయాలు.

హైదరాబాద్ బీరంగూడ క్లాత్ షోరూంలో లిఫ్ట్ తెగిపడటంతో ప్రమాదం జరిగింది. సోమవారం (జులై 14) రామచంద్రపురం పరిధిలోని బీరంగూడ కమాన్ సమీపంలో ఓ బట్టల షో రూమ్ లో మూడవ అంతస్తులో లిఫ్ట్ తెగిపడింది. ఈ ప్రమాదంలో లిఫ్ట్ కింద పడ్డ 11 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు

బీరంగూడలోని స్రవంతి సిల్క్స్ షోరూంలో 14 మంది స్టిక్కరింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. 14 మంది కార్మికులలో  11 మంది కి తీవ్ర గాయాలు అయ్యాయి. లిఫ్ట్ ఒక్కసారిగా వచ్చి పడటంతో 
కాళ్ళు, చేతులు విరిగి  కార్మికులు గాయాల పాలయ్యారు. గాయపడ్డ కార్మికులను సమీప మెరీడియన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

షోరూంలో 3వ అంతస్తులో స్టిక్కరింగ్ పనుల్లో ఉండగా లిఫ్ట్ తెగిపడిందని బాధితులు తెలిపారు. అకస్మాత్తుగా లిఫ్ట్ పడటంతో తప్పించుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 

►ALSO READ | హైదరాబాద్లోని ఈ ఇంట్లో ఏడేళ్లుగా ఎవరూ లేరు.. ఇంట్లో చూస్తే అస్థి పంజరం కనిపించింది !