లైగర్ మూవీ బాధితులకు న్యాయం చేయండి.. దీక్షకు దిగిన ఎగ్జిబిటర్స్

లైగర్ మూవీ బాధితులకు న్యాయం చేయండి.. దీక్షకు దిగిన ఎగ్జిబిటర్స్

లైగర్ సినిమా విషయంలో తమకు జరిగిన నష్టానికి తగిన న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అండ్ లీజర్స్ అసోసియేషన్ ఫిలిం ఛాంబర్ ముందు నిరవధిక దీక్షకు దిగింది. తేదీ 12-05-2023 నుండి ఈ దీక్ష కొనసాగనుంది. ఈ విషయంలో తమకు న్యాయం జరిగే వరకు  దీక్ష కొనసాగుతుందని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అండ్ లీజర్స్ అసోసియేషన్ తెలిపింది.

సినిమాపై ఉన్న హైప్ కారణంగా అధిక ధరకు కొన్నామని, తీరా చూస్తే మూవీ డిజాస్టర్ కావడంతో తాము పెట్టిన ఖర్చులో సగం కూడా రాలేదని, ఎలాగైనా తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ఈ దీక్షపై లైగర్ మూవీ నిర్మాత, దర్శకుడు పూరి జగన్నాథ్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇక లైగర్ మూవీ 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కింది. కానీ రిలీజ్ తరువాత ఈ సినిమాకి మినిమమ్ కలెక్షన్స్ కూడా రాలేదు. దీంతో చాలా చోట్ల ఎగ్జిబిటర్స్ నష్టపోయారు.

అయితే లైగర్ రిలీజ్ సమయంలోనే ఈ విషయంలో కొంత వివాదం జరిగింది. దానికి పూరి జగన్నాథ్ కూడా సానుకూలంగానే స్పందించారు. అది అక్కడితో ముగిసిపోయింది అనుకున్నారు అంతా. కానీ తాజా పరిణామంతో.. ఆ సమస్య ఇంకా ఓ కొలిక్కి రాలేదని అర్థమయింది. మరి ఈ ఇష్యూపై ఫిలిం ఛాంబర్ కానీ, పూరి జగన్నాథ్ కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.