లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ లైగర్. పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించగా.. రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. కాగా, ఈ సినిమాతో వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ మొదటిసారిగా ఇండియా వెండి తెర మీద కనిపించబోతున్నారు. 

అయితే ఈరోజు లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా లైగర్ టీం ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. దీని సంబంధించి ఒక స్పెషియల్ వీడియోను చిత్రం బృందం సోషల్ మీడియాలో వదిలారు. ఈ వీడియోలో నిర్మాత కరణ్ జోహార్, విజయ్ దేవరకొండ, ఛార్మీ కౌర్, విష్ణు, అనన్య పాండే అలాగే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మైక్ టైసన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో 'లైగర్' మూవీకి సంబంధించిన మేకింగ్ విజువల్స్ ను అడ్ చేశారు చిత్ర బృందం. 

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. లైగర్ మూవీ హిందీ తెలుగు తమిళం కన్నడ మరియు మలయాళం భాషల్లో రూపొందుతున్నది. ఈ చిత్రాన్ని 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.