గోల్స్ వర్షంతో మెస్సీ అరుదైన రికార్డు

గోల్స్ వర్షంతో మెస్సీ అరుదైన రికార్డు

ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఈస్టోనియాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ లో అర్జెంటీనా దిగ్గజం  మెస్సీ  5 గోల్స్ వేసి జట్టును గెలిపించాడు. అర్జెంటీనా జట్టు  తరఫున ఒక మ్యాచ్‌లో మెస్సీ 5 గోల్స్ వేయడం ఇదే ఫస్ట్ టైం.  దీంతో ఇంటర్నేషనల్ మెన్స్ ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ నాలుగో స్థానానికి చేరుకున్నాడు.  ఈ మ్యాచులో ఐదు గోల్స్  చేయడం ద్వారా మెస్సీ తన గోల్ సంఖ్యను 86కి పెంచుకున్నాడు.

ఈ గేమ్ లో ఫస్ట్ హాఫ్లో  పెనాల్టీ కిక్‌లతో మెస్సీ రెండు గోల్స్ సాధించాడు.  సెకండాఫ్లో మరో మూడు గోల్స్ వేశాడు. దీని ద్వారా  హంగేరియన్ ఫుట్బాల్  దిగ్గజం ఫ్రెనెక్ పుస్కాస్‌ను మెస్సీ దాటేశాడు.  ఫ్రెనెక్  తన ఫుట్బాల్ కెరీర్ లో మొత్తం 84 గోల్స్ చేశాడు. ఇక పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో ​​రొనాల్డో 117 గోల్స్‌తో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో ప్లేస్ లో 109 గోల్స్తో  ఇరాన్‌కు చెందిన అలీ డీ, మూడో స్థానంలో 89 గోల్స్తో  మలేషియాకు చెందిన ముఖ్తార్ దహరి ఉన్నారు.