మునుగోడులో 80కేజీల చికెన్ తరలిస్తూ పట్టుబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు

మునుగోడులో 80కేజీల చికెన్ తరలిస్తూ పట్టుబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు

మునుగోడులో ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచినట్లుగా తెలుస్తోంది. పసునూరు గ్రామంలో టీఆర్ఎస్ నేత వెంకటరెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. భారీగా మద్యం, కూల్ డ్రింక్స్, గడియారాలు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నారాయణపురం మండలం స్థితియతండాకు చెందిన టిఆర్ఎస్ కార్యకర్తలు 80 కేజీల చికెన్ తరలిస్తూ పట్టుబడ్డారు. ఓటర్లకు పంచేందుకు కవర్లలో చికెన్ను సిద్ధంగా ఉంచగా..పోలీసులు పట్టుకున్నారు.  పోలింగ్కు సమయం దగ్గరపడడంతో పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. 

పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు

గురువారం ఉదయం  ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. మునుగోడు బై పోల్ బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులున్నారు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్  నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు.  నవంబర్ 6న ఫలితాలు వెలువడనున్నాయి.  

ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ జరిగే 48 గంటలకు ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. కౌంటింగ్ ముగిశాక ఈసీ కోడ్ ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ తరువాత యధావిధిగా సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు.