వైన్స్ కు కన్నం.. 15 బాటిళ్లు చోరీ

వైన్స్ కు కన్నం.. 15 బాటిళ్లు చోరీ

జీడిమెట్ల, వెలుగు: ఓ వైన్​షాపులో లిక్కర్​ బాటిళ్లు చోరీకి గురయ్యాయి. సూరారం పోలీస్​ స్టేషన్​ పరిధి శివాలనగర్​లోని ఆర్యన్​ వైన్​ షాపునకు గురువారం అర్ధరాత్రి 12 దాటాక ఓ యువకుడు కన్నం వేశాడు. నిచ్చెన సాయంతో షాపులోకి దిగి.. దుకాణం మొత్తం పరిశీలించి 15 మద్యం సీసాలు, కొంత నగదును దొంగలించాడు. ఈ తతంగమంతా సీసీ కెమెరాలో రికార్డైంది. షాపు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.