రాష్ట్రంలో మద్యం రేట్లను తగ్గిస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లిక్కర్ సేల్స్ పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ధరలను తగ్గించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో క్వార్టర్ మీద రూ.10, హాఫ్ మీద రూ.20, ఫుల్ బాటిల్ మీద రూ.40 తగ్గాయి. అయితే కొంతమంది మద్యం యజమానులు మాత్రం పాత ధరలకే మద్యం అమ్ముతూ మద్యం ప్రియుల నుంచి డబ్బులను దోచుకుంటున్నారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగా గ్రామంలో ఉన్న ఓ మద్యం షాపులో పాత రేట్లకే మద్యం అమ్ముతుండడంతో మద్యం ఓనర్లకు, గ్రామస్థులకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆందోళన చేసిన ఎంపీటీసీ పై మద్యం ఓనర్ గూడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
మద్యం ధరలను ఒకవేళ ప్రభుత్వం పెంచితే ఉన్న స్టాక్ మొత్తం కొత్త నిబంధనలకు అనుగుణంగా రేటు పెరిగాయని అమ్ముతుంటారు. మరి అలాంటిది ప్రభుత్వం రేటు తగ్గించినప్పుడు ఉన్న స్టాక్ కూడా తగ్గించే కదా అమ్మాలని మద్యం ప్రియులు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు.
ఏజెన్సీ మండలాల్లో నడుస్తున్న మద్యం షాపుల్లో రేట్లు ఇష్టారాజ్యంగా ఉన్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వెంటనే ప్రభుత్వం ప్రకటించిన ధరల ప్రకారమేక్వార్టర్ మీద రూ.10, హాఫ్ మీద రూ.20, ఫుల్ బాటిల్ మీద రూ.40 లకు అమ్మాలని లేదంటే బ్రాందీ షాపుల ముందు ఆందోళన చేయడానికి అయినా తాము సిద్ధమేనని మద్యం ప్రియులు హెచ్చరిస్తున్నారు.