- లిక్కర్‌పై ఒక్కపైసా పన్ను విధించలేదు: మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: జీఎస్టీ సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం తెలిపింది. సామాన్యులపై భారం పడకుండా బిల్లులో పలు మార్పులు చేయాలని సూచించింది. మంగళవారం బిల్లుపై చర్చ జరిగిన అనంతరం మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జీఎస్టీ వివరాలు వెల్లడించారు. లిక్కర్,పెట్రోల్, డీజిల్ జీఎస్టీకి పరిధిలోకి రావని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ జీఎస్టీతో రాష్ట్రానికి రూ.7 వేల కోట్లు నష్టం వాటిల్లుతోందన్నారు.
లిక్కర్, పెట్రోల్, డీజిల్‌పై కూడా జీఎస్టీ విధించాలని సూచించారు. రూ.9కే క్వార్టర్ లిక్కర్ తయారవుతుండగా.. రూ.180కు విక్రయిస్తున్నారని అన్నారు. లిక్కర్ టాక్స్‌పై ప్రజలకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. కాగా, మద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్కపైసా కూడా పన్ను విధించలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
