లిక్కర్ సేల్స్ పెరిగినయ్

లిక్కర్ సేల్స్ పెరిగినయ్
  • లిక్కర్ సేల్స్ పెరిగినయ్
  • ఈసారి జనవరి, ఫిబ్రవరిలో పోయినేడు కంటే ఎక్కువే 
  • యావరేజ్ గా 300 కోట్ల నుంచి  500 కోట్లు పెరుగుదల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లిక్కర్ ​సేల్స్​ఏటా పెరుగుతున్నాయి. పోయినేడాదితో పోలిస్తే ఈసారి మొదటి రెండు నెలల్లో సేల్స్ పెరిగాయి. పోయినేడాది జనవరిలో రూ.2,548 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగితే, ఈసారి జనవరిలో  రూ.2,864 కోట్ల సేల్స్ జరిగాయి. ఇక పోయినేడు ఫిబ్రవరిలో రూ. 1,719 కోట్ల అమ్మకాలు జరిగితే, ఈసారి ఈ నెలలో ఇప్పటి దాకా రూ.1,600 కోట్ల సేల్స్ జరిగాయి. మిగిలిన 8 రోజుల్లో రూ.600 కోట్ల దాకా లిక్కర్​సేల్ అయ్యే అవకాశం కానుంది. ఈ లెక్కన యావరేజ్ గా జనవరిలో రూ.300 కోట్ల సేల్స్ పెరగగా, ఫిబ్రవరిలో రూ.500 కోట్లు పెరిగే చాన్స్ ఉంది. సీజన్​ను బట్టి అమ్మకాలు పెరుగుతున్నాయని, రానున్న మూడు నెలల్లో మరింత పెరుగుతాయని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. 

ఈసారి రూ.39 వేల కోట్ల అంచనా

రానున్న ఫైనాన్షియల్ ఇయర్ లో మద్యం అమ్మకాలతో ఏకంగా రూ.39 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం బడ్జెట్ లో అంచనా వేసింది. ఇందులో వ్యాట్ ద్వారా రూ.20 వేల కోట్లు, ఇంకో రూ.19 వేల కోట్లు స్టేట్​ఎక్సైజ్​ కింద అంచనా వేసింది. ఇక 2022 జనవరి 1 నుంచి డిసెంబర్​30 వరకు ఏకంగా రూ.34,117  కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇది ఆల్ టైమ్ రికార్డు. ఈ అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.29 వేల కోట్ల ఆదాయం వచ్చింది. టార్గెట్ల పేరుతో లిక్కర్ సేల్స్ ను ప్రోత్సహిస్తుండడంతో ఇన్​కమ్ పెరుగుతోంది.