కర్ణాటకలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

కర్ణాటకలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేయడంతో వైన్ షాపుల దగ్గర భారీ సంఖ్యలో జనం బారులు తీరారు. ఎక్కడ చూసినా కిలోమీటర్ల కొద్ది క్యూలైన్లలో నిలబడి లిక్కర్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మద్యం అమ్మకాలు ప్రారంభమై మూడు రోజులు కాగా… కర్ణాటక ఎక్సైజ్ శాఖ భారీస్థాయిలో ఆదాయాన్ని తన ఖజానాలో వేసుకుంది. ఇవాళ(గురువారం) కర్ణాటక మొత్తమ్మీద రూ.165 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. మొదటి రెండు రోజుల్లోనే కర్ణాటకలో రూ.242 కోట్ల మేర లిక్కర్ అమ్మకాలు జరిగాయి.