బాకీ బాబుల లిస్టు దొరికింది!

బాకీ బాబుల లిస్టు దొరికింది!

డిఫాల్టర్ల జాబితా వెల్లడి
ఆర్టీఐ ప్రకారం అందజేసిన ఆర్‌‌బీఐ
చోక్సీ 3 కంపెనీలూ డిఫాల్ట్‌‌ లిస్ట్‌‌లోనే

న్యూఢిల్లీబ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు ఉద్దేశపూర్వంగా బాకీలను ఎగ్గొట్టిన వారి (డిఫాల్టర్లు) జాబితాను ఆర్‌‌బీఐ ఎట్టకేలకు వెల్లడించింది. డిఫాల్టర్ల లిస్టును బయపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నాలుగేళ్ల తరువాత ఆర్‌‌బీఐ ఈ చర్య తీసుకుంది. ఇంగ్లిష్‌‌ న్యూస్‌‌ వెబ్‌‌సైట్‌‌ ‘ది వైర్‌‌’ సమాచార హక్కు చట్టం కింద డిఫాల్టర్ల లిస్టు అడగ్గా ఆర్‌‌బీఐ 30 మంది మేజర్ విల్‌‌ఫుల్‌‌ డిఫాల్టర్ల లిస్టును విడుదల చేసింది. గతంలో చాలా మంది ఈ లిస్టును అడిగినా, జాతి ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయని వాదిస్తూ ఆర్‌‌బీఐ ఆర్‌‌టీఐ అప్లికేషన్లను తోసిపుచ్చింది. అయితే బాధిత బ్యాంకులు, ఎన్‌‌బీఎఫ్‌‌సీలు బాకీలను రాబట్టుకోవడానికి డిఫాల్టర్లపై కోర్టుల్లో కేసులు వేయడంతో, కొంత సమాచారం బయటికి వచ్చింది.

చోక్సీ నంబర్‌‌ వన్‌‌

ఈ లిస్టు ప్రకారం బ్యాంకులకు అత్యధికంగా బకాయిపడ్డ వారిలో గీతాంజలి జెమ్స్‌‌ యజమాని మెహుల్‌‌ చోక్సీ మొదటిస్థానంలో ఉన్నాడు. ఇతనికి చెందిన మూడు కంపెనీలు అప్పులను ఎగ్గొట్టాయి. ఈ 30 కంపెనీలకు ఇచ్చిన అప్పులు విలువ, రద్దు చేసిన వాటి విలువ రూ.50 వేల కోట్ల వరకు ఉంది. అయితే ట్రాన్స్‌‌ యూనియన్‌‌ సిబిల్ డేటా ప్రకారం గత ఏడాది డిసెంబరు వరకు 11 వేల కంపెనీలు బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన బాకీల విలువ రూ.1.61 కోట్లకు చేరింది. సెంట్రల్‌‌ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌‌ ఆన్‌‌ లార్జ్‌‌ క్రెడిట్స్‌‌ (సీఆర్‌‌ఐఎల్‌‌సీ) నుంచి ఆర్‌‌బీఐ ఈ లిస్టును తీసుకుంది. రూ.ఐదు కోట్లు అంతకంటే ఎక్కువ బాకీ ఉన్న వారి వివరాలను ఇందులో చేర్చుతారు. బ్యాంకులకూ ఇందులోని సమాచారాన్ని ఇవ్వడం వల్ల డిఫాల్టర్లను గుర్తించి, వారికి అప్పులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బ్యాంకులకు సీఆర్‌‌ఐఎల్‌‌సీ డేటా అందజేస్తున్నారు. ‘‘బాకీ చెల్లించే సామర్థ్యం ఉండి కూడా కట్టని కంపెనీని, వ్యక్తిని, ఒక అవసరం కోసం అప్పు తీసుకొని మరో అవసరం కోసం నిధులను వాడిన వారిని’’ ఆర్‌‌బీఐ డిఫాల్టర్లగా పిలుస్తోంది. కింది లిస్టులోని మొత్తాలు బకాయిపడ్డ అడ్వాన్సులు/రద్దు చేసిన బాకీల విలువ చూపిస్తోంది. వీటిలో మొత్తం ఎన్​పీఏలు లేవు.

కంపెనీ                              బకాయిలు (రూ.కోట్లలో)

గీతాంజలి లిమిటెడ్‌                                 5,044

రీ ఆగ్రో లిమిటెడ్‌                                      4,197

విన్సమ్‌ డైమండ్స్‌ అండ్‌ జ్యూయలరీ లిమిటెడ్‌ 3,386

రుచి సోయా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌                  3,225

రొటోమాక్‌ గ్లోబల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌                2,844

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ లిమిటెడ్‌                2,488

కుడోస్‌ కెమీ                                          2,326

జూమ్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌                2,024

డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌               1,951

ఏజీబీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌                         1,875

ఫరెవర్‌ ప్రెషస్‌ జ్యూయలర్స్‌ లిమిటెడ్‌            1,718

సూర్య వినాయక ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌            1,628

ఎస్‌ కుమార్స్‌ నేషన్‌ వైడ్‌                          1,581

గిలీ ఇండియా లిమిటెడ్‌                            1,447

సిద్ధివినాయక లాజిస్టిక్‌ లిమిటెడ్‌                 1,349

కంపెనీ                            బకాయిలు (రూ.కోట్లలో)

వీఎంసీ సిస్టమ్స్‌‌ లిమిటెడ్‌‌                        1,314

గుప్తా కోల్‌‌ ఇండియా ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌           1,235

నక్షత్ర బ్రాండ్స్‌‌ లిమిటెడ్‌‌                           1,148

ఇండియన్‌‌ టెక్నోమాక్‌‌ కంపెనీ లిమిటెడ్‌‌      1,091

శ్రీ గణేశ్‌‌ జ్యూయలరీ హౌస్‌‌  లిమిటెడ్‌‌            1,085

జైన్‌‌ ఇన్‌‌ఫ్రా లిమిటెడ్‌‌                              1,076

సూర్య ఫార్మా లిమిటెడ్‌‌                            1,065

నకోడా లిమిటెడ్‌‌                                    1,028

కేఎస్‌‌ ఆయిల్స్‌‌ లిమిటెడ్‌‌                          1,026

కోస్టల్‌‌ ప్రాజెక్ట్స్‌‌ లిమిటెడ్‌‌                              984

హనుంగ్‌‌ టాయ్స్‌‌ అండ్‌‌ టెక్స్‌‌టైల్స్‌‌ లిమిటెడ్‌‌      949

ఫస్ట్‌‌ లీజింగ్‌‌ కంపెనీ ఆఫ్‌‌ ఇండియా లిమిటెడ్‌‌     929

కాన్‌‌కస్ట్‌‌ స్టీల్‌‌ అండ్‌‌ పవర్‌‌ లిమిటెడ్‌‌                 888

యాక్షన్‌‌ ఇస్పాత్ అండ్‌‌ పవర్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌    888

డైమండ్‌‌ పవర్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ 869

మరిన్ని వార్తల కోసం