కృష్ణ బర్త్ డేకు సుధీర్ బాబు అదిరిపోయే గిఫ్ట్

కృష్ణ బర్త్ డేకు సుధీర్ బాబు అదిరిపోయే గిఫ్ట్

తన మామ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని ఫ్యాన్స్కు నైట్రో స్టార్ సుధీర్ బాబు సర్ప్రైజింగ్ గిఫ్ట్ను అందించాడు. మామాకు గ్రాండ్గా  బర్త్ డే విషెష్ తెలుపుతూ..తన తాజా మూవీ మామా మశ్చీంద్ర గ్లింప్స్ను విడుదల చేశాడు. తనతో పాటు ఎంతో మంది నటీనటులకు ఆదర్శమైన మామయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ సుధీర్ బాబు వెల్లడించాడు .

ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్తో సినిమాపై అంచనాలు పెంచిన సుధీర్ బాబు..తాజాగా విడుదల చేసిన గ్లింప్స్తో మూవీపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేశాడు. ఈ గ్లింప్స్లో సిక్స్ ప్యాక్తో దర్శనమిచ్చాడు. సూపర్ మ్యూజిక్కు సెన్సెషనల్ స్టెప్స్తో అదరగొట్టాడు.  ఈ సినిమాకు హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తుండగా..నారాయణదాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. సోనాలి నారంగ్, సృష్టి సెల్యులాయిడ్ సమర్పిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది.

SMS ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు..11 ఏళ్ల సినీ కెరియర్ లో 17 సినిమాల్లో యాక్ట్ చేశాడు. అయితే ఏమాయ చేశావే మూవీలో చిన్న కారెక్టర్ చేసినా..ఎస్ఎంఎస్ ద్వారా పూర్తి స్థాయి పాత్ర చేశాడు. ప్రతీ సినిమాను డెడికేటెడ్ గా చేస్తూ..నైట్రో గా ఎదిగాడు.