ప్రియుడు తాగొచ్చి వేధిస్తున్నాడని..లివ్ ఇన్ పార్ట్ నర్ ఆత్మహత్య.. గుండ్లపోచంపల్లిలో ఘటన.

ప్రియుడు తాగొచ్చి వేధిస్తున్నాడని..లివ్ ఇన్  పార్ట్ నర్ ఆత్మహత్య.. గుండ్లపోచంపల్లిలో ఘటన.
  • సూసైడ్ నోట్ స్వాధీనం 

జీడిమెట్ల, వెలుగు: తన ప్రియుడు వేరే అమ్మాయితో చనువుగా ఉండడంతోపాటు తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్​గడ్​కు చెందిన పల్లవి లహరి (19), వరంగల్​కు చెందిన జల్ల సందీప్ (21) గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ గుండ్లపోచంపల్లిలో ఒక గదిని అద్దెకు తీసుకుని లివ్ ఇన్ రిలేషన్​షిప్ ఉంటున్నారు.

కొద్దిరోజులుగా వీరి మధ్య ప్రేమ, డబ్బు విషయాల్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కూడా ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, సందీప్ బయటకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చేసరికి పల్లవి లహరి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

‘సందీప్ మరో అమ్మాయితో మాట్లాడుతూ, మద్యం తాగొచ్చి నన్ను వేధిస్తున్నాడు’ అని ఆమె రాసిన సూసైడ్ నోట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లహరి తండ్రి సంతోశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.