
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రిలో బుధవారం ఆయన టీకా వేయించుకున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఫేజ్ తొలి రోజునే ప్రధాని మోడీ కొవ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. దీంతో టీకా తీసుకున్న జీ20 దేశాల కూటమి నేతల్లో 9వ లీడర్‌గా మోడీ నిలిచారు. ఈ గ్రూప్ దేశాల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ టీకా వేయించుకున్న తొలి నేతగా నిలువగా.. ఆ తర్వాత అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ వ్యాక్సిన్ తీసుకోవడం విశేషం.