
హైదరాబాద్, వెలుగు: లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ తన ఏఐ నాయకత్వాన్ని విస్తరిస్తూ శిరీష్ తాటికొండను కొత్త ఏఐ లీడ్‌గా నియమించింది. ఆయన హైదరాబాద్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కీలక పాత్ర పోషిస్తూ, అత్యాధునిక ఏఐ సొల్యూషన్స్ అభివృద్ధిని నడిపిస్తారని సంస్థ తెలిపింది.
ఏఐ, మెషీన్ లెర్నింగ్‌లో శిరీష్‌కు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. వాల్‌మార్ట్ గ్లోబల్ టెక్ నుంచి ఆయన లాయిడ్స్‌లో చేరారు. ఈ నియామకం ద్వారా లాయిడ్స్ తన ఏఐ ఇన్నోవేషన్లను, కస్టమర్ అనుభవాలను మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.