ఇంకెందుకు ఆ కార్డులు : ఇన్సూరెన్స్ అప్పును.. క్రెడిట్ కార్డుతో చెల్లించకూడదు

ఇంకెందుకు ఆ కార్డులు : ఇన్సూరెన్స్ అప్పును.. క్రెడిట్ కార్డుతో చెల్లించకూడదు
  • ఎల్ ఐ సీపై తీసుకున్న రుణం.. క్రెడిట్‌ కార్డుతో తిరిగి చెల్లించడంపై నిషేధం

జీవిత బీమా పాలసీపై తీసుకున్న రుణాన్ని క్రెడిట్‌ కార్డు ద్వారా తిరిగి చెల్లించడాన్ని భారత బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) నిషేధించింది. ఈ నిర్ణయాన్ని బీమా కంపెనీలు స్వాగతించాయి. భారీ వడ్డీ రేటుతో కూడిన క్రెడిట్ కార్డు రుణంతో పాలసీపై రుణాన్ని తిరిగి చెల్లించడం కార్డు ప్రయోజనం కలిగించిందని  బీమా సంస్థలు తెలిపాయి.  ఇందుకు సంబంధించి ఈ నెల 4న బీమా సంస్థలకు సర్య్కులర్ జారీ చేసింది.  

రుణం తిరిగి చెల్లింపు కోసం క్రెడిట్‌ కార్డు నుంచి అప్పుగా తీసుకున్న సొమ్ముపై అధిక వడ్డీ చెల్లించడం కస్టమర్లకు ఏమాత్రం ప్రయోజనకరం కాదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. చాలావరకు బీమా కంపెనీలు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీపై తీసుకునే రుణాలపై 8-నుంచి 15 శాతం వార్షిక వడ్డీ వసూలు చేస్తుండగా.. క్రెడిట్‌ కార్డు సంస్థల వడ్డీ రేటు 20 శాతంపైనే ఉంది.