ఏపీలో స్థానిక ఎన్నికలు మరోసారి వాయిదా

ఏపీలో స్థానిక ఎన్నికలు మరోసారి వాయిదా

కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు ఆరువారాల పాటు వాయిదాపడ్డాయి. ఆ గడువు ఏప్రిల్‌ 31తో ముగిసిపోయింది .ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో  స్థానిక సంస్థల ఎన్నికలు మరికొంత కాలం వాయిదా వేస్తున్నట్టు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ నిలిపివేయాలని నిర్ణయించారు. కరోనా అదుపులోకి రాకపోవడం, లాక్ డౌన్, హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల నిలిపివేతను కొనసాగిస్తామని ఆ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలించాక ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ కనగరాజ్‌ స్పష్టం చేశారు.