డబుల్ బెడ్ రూం ఇండ్లకోసం రోడ్డెక్కిన బాధితులు

డబుల్ బెడ్ రూం ఇండ్లకోసం రోడ్డెక్కిన బాధితులు

స్థానికులకే డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని మహేశ్వరం  నియోజకవర్గంలో ఆందోళనకు దిగారు స్థానికులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండలం మన్సాన్ పల్లిలో స్థానిక ప్రజలు మన్సాన్ పల్లి చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రాస్తోరోకో నిర్వహించారు. మన్సాన్ పల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించే సమయంలో  స్థానిక ప్రజలతో కలిసి వివిధ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు.  

డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కేటాయిస్తున్నారని.. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి నివసించే స్థానికులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. తక్షణమే డబుల్ బెడ్ ఇండ్లను స్థానికులకు కేటాయించి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్ కు తరలించారు.