డిఫెన్స్ ‘బడ్జెట్’ అద్భుతం

డిఫెన్స్ ‘బడ్జెట్’ అద్భుతం
  • డిఫెన్స్ లో లోకల్​ వెపన్స్​
  • మిలటరీ ప్రొక్యూర్ మెంట్స్ లో 68% డొమెస్టిక్ ఇండస్ట్రీకే

న్యూఢిల్లీ: రక్షణ రంగంలో స్వదేశీ వెపన్స్, మిలటరీ వ్యవస్థల కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రకటించారు. సాయుధ బలగాలకు ఎక్విప్ మెంట్ కొనుగోళ్లలో ఇంపోర్టుల కంటే స్వదేశీ ఉత్పత్తులకే ప్రయారిటీ ఇస్తామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా డిఫెన్స్ ప్రొక్యూర్ మెంట్ లో 68% క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ ను డొమెస్టిక్ ఇండస్ట్రీకే కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తంగా డిఫెన్స్ కు నిరుడు కేటాయించిన (రూ. 4.78 లక్షల కోట్లు) కన్నా ఈ సారి 0.47 శాతం అధికంగా రూ. 5,25,166 కోట్లు అలకేట్ చేశారు. డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్ మెంట్ లో ప్రైవేట్ సెక్టార్ కు అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్ లతో కలిసి ఖర్చు చేసేందుకు 25 శాతం ఫండ్స్ కేటాయించారు. ప్రైవేట్ కంపెనీలు తమ కొత్త టెక్నాలజీలను టెస్టింగ్ చేసుకుని, సర్టిఫికేషన్ పొందేందుకు వీలుగా ఇండిపెండెంట్ నోడల్ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇక పెన్షన్లకు గతేడాది కన్నా 9.8 శాతం అధికంగా రూ. 1,19,696 కోట్లు కేటాయించారు. కొత్త వెపన్స్, ఎయిర్ క్రాఫ్ట్ లు, వార్ షిప్స్, మిలిటరీ హార్డ్ వేర్ కొనుగోళ్లకు రూ. 1,52,369 కోట్ల క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ ను అలకేట్ చేశారు. జీతాలు, రక్షణ సంస్థల నిర్వహణ కలిపి రూ. 2,33,000 కోట్ల రెవెన్యూ ఎక్స్ పెండిచర్ ను కేటాయించారు.

నేవీకి భారీగా పెరిగిన అలకేషన్స్  
ఆర్మీకి నిరుడు రూ.36,481 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.32,015 కోట్లు ఇచ్చారు. ఇందులో ఆర్మీ రూ.25,377 కోట్లను ఖర్చు చేసే అవకాశం ఉంది. నేవీకి నిరుటి కంటే ఈ సారి భారీగా కేటాయింపులు పెరిగాయి. మొత్తం రూ. 47,590 కోట్లు కేటాయించారు. అయితే, నిరుడు నేవీకి రూ. 33, 253 కోట్లు కేటాయించినప్పటికీ, రూ.46,021 కోట్లు ఖర్చు చేశారు. ఇక ఎయిర్ ఫోర్స్ కు నిరుటి కంటే రూ. 2,214 కోట్లు అధికంగా రూ.55,586 కోట్లు అలకేట్ చేశారు. ఇందులో ఎయిర్ ఫోర్స్ రూ. 51,830 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. 

డిఫెన్స్ ‘బడ్జెట్’ అద్భుతం
కేంద్ర బడ్జెట్ లో డిఫెన్స్ మినిస్ట్రీకి ప్రాధాన్యం ఇవ్వడం బాగుంది. డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్ మెంట్ లో ప్రైవేట్ సంస్థలు, స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు 25 శాతం ఫండ్స్ ను కేటాయించడం అద్భుతమైన నిర్ణయం. వెపన్స్ ప్రొక్యూర్ మెంట్ లో 68 శాతం క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ ను స్వదేశీ ఇండస్ట్రీకే కేటాయించడం కూడా స్వాగతించదగ్గ విషయం. ‘వోకల్ ఫర్ లోకల్’ విధానంలో తీసుకున్న ఈ నిర్ణయంతో మన దేశ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కు ఊతం లభిస్తుంది. 
- రాజ్​నాథ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్