కడాయిని హెల్మెట్‌గా పెట్టుకున్న బెంగళూరు వ్యక్తి: ఫైన్ పడిందిగా.. ?

కడాయిని హెల్మెట్‌గా పెట్టుకున్న బెంగళూరు వ్యక్తి: ఫైన్ పడిందిగా.. ?

మన దేశంలో రోడ్లపై హెల్మెట్‌ పెట్టుకునేవాళ్ళు తక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే కొందరు హెల్మెట్ ఎందుకులే అని, మరికొందరు బరువు ఎందుకు అని.. కానీ హెల్మెట్ మన ప్రాణానికి చాల ముఖ్యమైనది.. అయితే ఈ సమస్యకు ఓ కొత్త పరిష్కారం వెతికాడు బెంగళూరుకు చెందిన వ్యక్తి.

హెల్మెట్‌కు బదులుగా తలపై కడాయి (ఫ్రైయింగ్ పాన్) పెట్టుకుని బైక్ పై బెంగళూరులో కనిపించాడు. ఇది చూసిన ప్రయాణికులతో పాటు  ట్రాఫిక్ పోలీసులు కూడా నవ్వుకున్నారు.

పసుపు టీ-షర్ట్‌ ధరించి  బైక్ వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తనని AI కెమెరాలు లేదా ట్రాఫిక్ పోలీసులు గుర్తించకుండా, చలాన్ (ఫైన్) పడకుండా ఈ కడాయి పెట్టుకున్నట్లు చెప్పాడు.

కానీ ఇంత చేసిన తప్పించుకోలేకపోయాడు.. మడివాలా ట్రాఫిక్ పోలీసులు ఆ బండి నంబర్, అడ్రస్ కనిపెట్టారు. దింతో  రూల్స్  ఉల్లంఘించినందుకు నోటీసు పంపి, పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తగిన చర్య తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

నెటిజన్ల కామెంట్స్ :
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు చాల ఫన్నీగా కామెంట్లు చేశారు. బెంగళూరు ట్రాఫిక్‌లో మాత్రమే వంటపాత్రలు సేఫ్టీగా  మారుతాయి అంటూ...  సేఫ్టీ  ఫస్ట్, బ్రేక్ ఫాస్ట్ లేటర్ అని మరొకరు.... ఫైన్ రాసేటప్పుడు పోలీసులు నవ్వకుండా ఉండటం కష్టం అని ఇంకొకరు....  బడ్జెట్‌లో దొరికే బెస్ట్ ఇండియన్ ఇన్నోవేషన్  ఇది అని ఇలా రకరాలుగా కామెంట్స్   చేసారు.