OTT Review: తాగుడుకు బానిసైన తండ్రి.. మద్యం దుకాణాలను మూసివేయాలంటూ.. కొడుకుని కలెక్టర్‌‌‌‌ని చేసిన తల్లి

OTT Review: తాగుడుకు బానిసైన తండ్రి.. మద్యం దుకాణాలను మూసివేయాలంటూ.. కొడుకుని కలెక్టర్‌‌‌‌ని చేసిన తల్లి

“మద్యం (Alcohol)”.. ఇది ప్రతిచోటా వరదలై పారే ఓ చిచ్చుల రాకాసి సిక్తం. అయితే, ఇదే మద్యం కొన్నిసార్లు టెన్షన్స్ నుంచి గట్టేక్కిస్తుంది. మరొకొన్ని సార్లు నిలువున నిల్చున్న మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తుంది. సమాజంలో మద్యం అమ్మకుండా, పూర్తిగా పారదోలాలని ఎవరెన్ని పోరాటాలు చేసిన.. తాగే వాళ్లు పుట్టుకొస్తున్నారు. అమ్మేవాళ్ళు మరింత రెచ్చిపోతున్నారు. గవర్నమెంట్స్ సైతం మద్యం పాలసీలు అంటూ, ట్రెండర్లు అంటూ నగారా మోగిస్తున్నారు. అలా మద్యాన్ని మనుషుల నుంచి దూరం చేయాలనుకోవడం అది వృథా ప్రాయసే అవుతుంది. ఎందుకంటే, ఇది ఇప్పటికీ.. ఎప్పటికీ అసాధ్యమనే తరుచూ అందరినోటా వినిపిస్తుంది. అయితే, ఇంకా కొన్నిచోట్ల.. అంటే సినిమాలలో మాత్రం.. మద్యం నిలిపేయాలని, అందుకు చట్టాలు తీసుకురావాలని.. మేకర్స్ కొత్త రచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా తమిళంలో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అదే కుయిలి (Kuyili).

పి మురుగసామి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇపుడు ఈ మూవీ ప్రైమ్ లో ఆడియన్స్ ని ఆలోచింపజేస్తుంది. ఇందులో లిజీ ఆంటోని, తష్మిగ లక్ష్మణ్, పుతుపెట్టై సురేష్, కంఠసామి, రవిచా ల నటన అందరినీ కట్టిపడేస్తున్నాయి. తాగుడుకు బానిసైన తండ్రి.. మద్యం దుకాణాలను మూసివేయాలంటూ తల్లి పోరాటం.. అందుకు కొడుకుని కలెక్టర్‌‌‌‌ని చేసి.. చట్టం తీసుకొచ్చేందుకు తల్లి చేసే ప్రయత్నం మెప్పిస్తుంది. 

కథేంటంటే:

కుయిలి (లిజీ ఆంటోని) తండ్రి తాగుడుకు బానిసై చనిపోతాడు. దాంతో ఆమె తాగుడు అలవాటు లేని ఒక వ్యక్తి (రవిచా)ని ప్రేమించి, పెండ్లి చేసుకుంటుంది. కానీ.. పెండ్లి జరిగిన కొన్నాళ్లకు అతను కూడా తాగుడుకు అలవాటుపడతాడు. దాంతో కుటుంబంలో తగాదాలు, సమస్యలు వస్తాయి.

ఒక రోజు కుయిలి భర్త మందు షాపు ఓనర్‌‌‌‌తో గొడవపడతాడు. దాంతో అతను కుయిలి భర్తను చంపేస్తాడు. ఆమె కోపంతో ఆ దుకాణాన్ని తగలబెడుతుంది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరి ఊళ్లో మద్యం అమ్మకూడదని పోరాటం ప్రారంభిస్తుంది.

గ్రామంలోని మద్యం దుకాణాలను చట్టబద్ధంగా మూసివేయాలనే లక్ష్యంతో కొడుకుని కలెక్టర్‌‌‌‌ని చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది మిగతా కథ.