మంచినీళ్లేవి...ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

మంచినీళ్లేవి...ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఖైరతాబాద్ లో నిరసన సెగ తగిలింది. నియోజకవర్గంలోని దత్త నగర్ లో పర్యటించిన దానం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వెళ్లిన ఆయనను స్థానికులు అడ్డుకున్నారు.  అయితే కొన్ని రోజులుగా  మంచి నీళ్లు రావడం లేదని  ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో శంకుస్థాపన చేయకుండానే వెళ్లిపోయారు దానం.

వచ్చిన కొన్ని నీళ్లను కూడా అపార్ట్ మెంట్ వాసులు మోటర్లు పెట్టుకుని వాడుకుంటున్నారని.. వాటర్ వర్క్ అధికారులు కూడా అపార్ట్ మెంట్స్ వారికే నీళ్ల ట్యాంకర్లు పంపుతున్నారని ఆరోపించారు. తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  తమ సమస్యలను పరిష్కరించాలని  స్థానికులు ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. దీంతో అపార్ట్ మెంట్   వాసులతో పాటు స్థానిక బస్తీ వాసులకు నీటిని సమయానికి సరఫరా చేయాలని వాటర్ వర్క్స్ అధికారులను దానం ఆదేశించారు.