టీజీవో స్టేట్ జనరల్ సెక్రటరీగా శ్యామ్..ఏకగ్రీవంగా ఎన్నుకున్న స్టేట్ కమిటీ

టీజీవో స్టేట్ జనరల్ సెక్రటరీగా శ్యామ్..ఏకగ్రీవంగా ఎన్నుకున్న స్టేట్ కమిటీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీవో ) అసోసియేషన్ స్టేట్ కమిటీ కొత్త జనరల్ సెక్రటరీ (జీఎస్) గా  శ్యామ్ ఎన్నికయ్యారు. టీజీవో రాష్ర్ట కార్యవర్గం శ్యామ్​ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రస్తుతం జీఎస్ గా ఉన్న సత్యనారాయణ ఈ నెల 31న రిటైర్ అవుతున్న నేపథ్యంలో కొత్త జీఎస్ ను రాష్ర్ట కమిటీ ఎన్నుకుంది. కొత్త జీఎస్ ఎన్నికపై గత రెండు నెలల నుంచి 33  జిల్లాలు, హైదరాబాద్ సిటీ కమిటీ, రాష్ర్ట కమిటీలోని సభ్యులతో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకొని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని టీజీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు శనివారం పత్రిక ప్రకటనలో  తెలిపారు. 

ప్రస్తుతం శ్యామ్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో సరూర్ నగర్– 3 సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా తనకు జీఎస్ గా అవకాశం ఇచ్చినందుకు ప్రెసిడెంట్ ఏలూరి శ్రీనివాసరావుతో పాటు 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులకు శ్యామ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎస్, డిప్యూటీ సీఎం, మంత్రులతో చర్చించి పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.