మైనింగ్ జోన్ ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్న స్థానికులు

మైనింగ్ జోన్ ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్న స్థానికులు

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లిలో మైనింగ్ జోన్ ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, రైతులు ఆందోళనకు దిగారు. మైనింగ్ జోన్ ఏర్పాటుపై అధికారులు ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి మడ్గుల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

రంగారెడ్డి జిల్లా  అడిషనల్ కలెక్టర్ పోలీస్ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, స్థానికులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నాడు. మైనింగ్ జోన్ ఏర్పాటు చేయొద్దని నినాదాలు చేశారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.