జింక్​తో కరోనాకు లాక్​! 

జింక్​తో కరోనాకు లాక్​! 

ఈ కరోనా కాలంలో  రోగనిరోధక శక్తిని పెంచే తిండే ముద్దంటున్నారంతా. ఇమ్యూనిటీ కోసం తినదగ్గ వాటిల్లో జింక్ ఒకటి.  కొవిడ్​ బారిన పడ్డ వారు తొందరగా కోలుకునేందుకు, కొవిడ్​ లక్షణాలు తగ్గడానికి  యాంటీ ఇన్​ఫెక్టివ్​, యాంటీ పారాసైటిక్​ డ్రగ్స్​ మాదిరిగానే జింక్​ కూడా పనికొస్తుందని అంటున్నారు సైంటిస్ట్స్​. 
రోజుకు 50మి. గ్రా జింక్​ తీసుకుంటే కరోనా వైరస్​​ నుంచి త్వరగా కోలుకోవచ్చని చాలా స్టడీస్​ చెబుతున్నాయి. ‘‘కరోనా ముప్పును తప్పించడం, కరోనా  ఇన్ఫెక్షన్​ తీవ్రతను తగ్గించడంలో జింక్​  చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా జింక్​ లోపం ఉన్నవాళ్లు,  మొండి జబ్బులతో బాధపడేవాళ్లు, పెద్దవాళ్లు జింక్​ ఉన్న ఫుడ్​ తింటే మంచిది.  దాంతో వీళ్లలో వైరస్​ ఇన్​ఫెక్షన్​ను తగ్గించడానికి కావాల్సిన రోగనిరోధక శక్తి పెరుగుతుంది”అని ఇంటిగ్రేటెడ్​ జర్నల్​లో పబ్లిష్​ అయిన స్టడీ చెబుతోంది.  జింక్​ లోపం వల్ల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం చాలా ఎక్కువని,  వైరల్​ ఇన్ఫెక్షన్లు కూడా సోకుతాయని అంటున్నారు ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ సీనియర్​ లెక్చరర్​ స్కాట్​.  రోజుకు 20మిల్లీ గ్రాముల జింక్​ తీసుకున్నా చాలు. అయితే 50మిల్లీ గ్రాములు తీసుకుంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్ల ముప్పు తప్పుతుంది. జింక్​ సప్లిమెంట్స్​ వల్ల ఆక్సిడేటివ్​ స్ట్రెస్​, ఇన్​ఫ్లమేటరీ సైటోకైన్స్​ ఉత్పత్తి తగ్గుతుందని ఎన్నో స్టడీస్​ ఇప్పటికే చెప్పాయి.