అసెంబ్లీకి వస్తే గేటుకు తాళం

అసెంబ్లీకి వస్తే గేటుకు తాళం

బెంగాల్​ గవర్నర్​కు చేదు అనుభవం

కోల్కతా:బెంగాల్​ గవర్నర్​ జగదీప్​ ధంకర్‌కు ​చేదు అనుభవం ఎదురైంది.  గురువారం అసెంబ్లీకి వచ్చిన గవర్నర్  షాక్​ తిన్నారు. ఆయన రాకపోకలను సాగించేందుకు  కేటాయించిన గేటుకు​తాళం వేశారు. అసెంబ్లీ రూల్స్​ ప్రకారం .. గవర్నర్ రావడానికి, పోవడానికి మూడో నెంబర్​ గేటు ని  ఉపయోగిస్తారు. అయితే గురువారం మాత్రం అలా జరగలేదు. ‘‘గవర్నర్​పదవికే” ఇది అవమానం అని ఈ ఘటనపై గవర్నర్​  సీరియస్​ అయ్యారు. ఈ చర్య ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని ఆయన అన్నారు.

మూడో నెంబర్​ గేటు కాకుండా    మీడియా, అధికారులకు కేటాయించిన గేటు​ నెంబర్​ 4 గుండా గవర్నర్​ అసెంబ్లీలోకి వెళ్లారు. “మూడో నెంబర్​ గేటు​ఎందుకు క్లోజ్​ చేశారు?  ముందుగా సమాచారం ఇచ్చినా గేటును మూసేశారు.   అసెంబ్లీ  వాయిదా పడిందంటే దానర్థం మూసేసినట్టుకాదు. ఇది నాకు జరిగిన అవమానం కాదు. మొత్తం రాష్ట్రప్రజలకు, రాజ్యాంగానికి జరిగిన అవమానం”అని గవర్నర్​ జగదీప్​అక్కడున్న మీడియాకు
చెప్పారు.

ఏం జరిగిందంటే?…

అసెంబ్లీలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు పరిశీలిస్తానని, లైబ్రరీని కూడా చూస్తానని అసెంబ్లీ స్పీకర్​ బిమన్​ బెనర్జీకి గవర్నర్​ బుధవారమే లెటర్​ రాశారు. ‘‘టూర్​కు సంబంధించిన సమాచారాన్ని అసెంబ్లీ స్పీకర్​ ఆఫీస్​కు పంపించాం.    ఆ తర్వాత  రాజ్​భవన్​ స్పెషల్​ సెక్రటరీకి అసెంబ్లీ  సెక్రటరీ నుంచి మెసేజ్​ వచ్చింది.   నన్ను రమ్మని వాళ్లు ఆహ్వానించారు. నా భార్యను కూడా లంచ్​కి ఇన్వైట్​చేశారు. దీంతో నేను ఆ ఇన్విటేషన్​కు  ఓకే చెప్పాను.   గంటన్నర తర్వాత మరో మెసేజ్ వచ్చింది. దాంట్లో ఇన్విటేషన్​ రద్దు చేస్తున్నట్టు  అసెంబ్లీ సెక్రటరీ  నా స్పెషల్​ సెక్రటరీకి  మెసేజ్ ఇచ్చారు. అసెంబ్లీ సెక్రటరీ, స్పెషల్​ సెక్రటరీ ఇద్దరూ  ఉండడంలేదని మెసేజ్ ​సారాంశం.

ఆ గంటన్నరలోపే  ఏ జరిగిందో నాకు ఆశ్చర్యం కలిగించింది. తనకు జరిగిన అవమానంపై స్పీకర్​కు లెటర్​ రాస్తాను”అని గవర్నర్​ మీడియాకు వివరించారు. రాజ్యాంగపరమైన పదవులకు  రాష్ట్ర ప్రభుత్వం సరైన గౌరవాన్ని ఇవ్వడంలేదని తృణమూల్ సర్కార్​ తీరుపై  గవర్నర్​ ఫైర్​ అయ్యారు.  ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదని కూడా ఆయన వార్నింగ్​ ఇచ్చారు. మరోవైపు, అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు గవర్నర్​ అప్రూవల్ ​రాలేదని చెబుతూ  మంగళవారం స్పీకర్​ అసెంబ్లీని రెండురోజులపాటు  వాయిదా వేశారు. అయితే ప్రభుత్వం చెబుతున్న దాంట్లో ఎలాంటి నిజంలేదని రాజ్​భవన్​ వర్గాలు   క్లారిటీ ఇచ్చాయి.

మరిన్ని వార్తల కోసం