ఉస్మానియా ఓల్డ్ బిల్డింగ్ కు తాళం

ఉస్మానియా ఓల్డ్ బిల్డింగ్ కు తాళం

అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లు కూడా తరలింపు
గతంలోనే పేషెంట్లను షిఫ్ట్ చేసిన ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా హాస్పిటల్ ఓల్డ్ బిల్డింగ్ పూర్తిగా ఖాళీ అయింది. ఇప్పటికే పేషెంట్లను ఇతర వార్డులకు షిఫ్ట్చేసిన అధికారులు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ల‌నూ పక్క బిల్డింగ్కు తరలించారు. డీఎంఈ ఆదేశాలతో సోమవారం ఓల్డ్ బిల్డింగ్ కు తాళం వేశారు . ఈ సందర్భంగా ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్ట‌ర్ పాండు నాయక్ మాట్లాడుతూ ..వర్షాలు కురిస్తే మళ్లీ హాస్పిటల్లోకి నీళ్లు వచ్చే అవకాశముందని, దీంతో పాటు పెచ్చులూడే ప్రమాదం కూడా ఉందన్నారు. పాత భవనంలో ట్రీట్ మెంట్ తీసుకోవాలంటే రోగులు, ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు భయపడ్డారన్నారు. పేషెంట్లను వారం క్రితమే వేరే బిల్డింగ్ కు మార్చామని, ప్రస్తుతం సూపరింటెండెంట్ చాంబర్ తో పాటు పలు విభాగాల హెచ్వోడీల ఆఫీసులనూ వేరే చోటుకు మార్చామన్నారు. నూతన బిల్డింగ్ నిర్మించే విషయం ప్రభుత్వం చేతిలో ఉందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ..