కరోనాను లౌక్ డౌన్ ఓడించలేదు

కరోనాను లౌక్ డౌన్ ఓడించలేదు
  • టెస్టుల సంఖ్య పెంచాలి: కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

న్యూఢిల్లీ: లాక్ డౌన్ కరోనా ను ఓడించలేదని, కొంతకాలంపాటు ఆపగలదని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. కరోనా ను కంట్రోల్ చేసేందుకు వ్యూహాత్మకంగా టెస్టుల సంఖ్యను పెంచాలని చెప్పారు. దేశంలో హాట్ స్పాట్, నాన్ హాట్ స్పాట్ గా రెండు జోన్లు మాత్రమే ఉండాలని సూచించారు. గురువారం కేరళలోని వయనాడ్ నుంచి వీడియో యాప్ ద్వారా ఆయన మాట్లాడారు. కరోనాను కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకోకుంటే మరోసారి లాక్ డౌన్ తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వం వైరస్ ను చేజ్ చేస్తోందని, అయితే కరెక్ట్ పిక్చర్ దొరకడం లేదని చెప్పారు. అన్ని దేశాలు టెస్టింగ్ కిట్ లను సమకూర్చుకుంటున్నాయని గుర్తు చేశారు. మన దేశంలో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ల కొరత ఉందని, ఇది వాస్తవమన్నారు. ప్రభుత్వం ఎక్కడ ఫెయిలైందని చర్చించేందుకు ఇది సమయం కాదని. నిర్మాణాత్మక సలహాలు మాత్రమే ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజల ప్రాణాలు కాపాడుతూ.. మన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసుకోరాదన్నారు. ఆర్థిక సంక్షోభంతోపాటు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం కావాలని చెప్పారు. చిన్న పరిశ్రమలు, మైగ్రంట్ వర్కర్స్, రైతులకు ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. దేశ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కరోనా లాంటి సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో మన దేశానికి తెలుసన్నారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. తన సూచనలను విమర్ళలుగా తీసుకోవద్దని కోరారు.