బ్యాంకుల పని వేళల్లో మార్పులు

బ్యాంకుల పని వేళల్లో మార్పులు

హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రేపటి (గురువారం) నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. బ్యాంక్‌లో 50 శాతం సిబ్బందితో సేవలు అందించనున్నారు. ఈ నెల 20 వరకు ఈ పనివేళలు కొనసాగుతాయి. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండడంతో ప్రభుత్వం హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కట్టడి కోసం లాక్ డౌన్ విధించక తప్పనిసరి ఏర్పడిందంటూ సర్కార్ ప్రకటించింది. లాక్ డౌన్ సందర్భంగా ఉదయం 6 నుంచి  10 గంటల వరకు దుకాణాలు, వ్యాపార కార్యకలాపాలు యధావిధిగా జరుపుకోవచ్చని సర్కార్ ప్రకటించింది. కేవలం నాలుగు గంటలపాటు ప్రజలు బయట తిరిగేందుకు అనుమతిచ్చినా.. బ్యాంకుల సేవల విషయంలో కాస్త విధానాలు మారాయి. బ్యాంకులు మధ్యాహ్నం 12 వరకు పనిచేస్తాయి. ఆ తర్వాత సిబ్బంది అందరూ ఇళ్లకు వెళ్లిపోతారు. లాక్డౌన్ మినహాయింపు  సమయం ఉదయం 10 గంటల వరకే కాబట్టి 12 తర్వాత ఇళ్లకు వెళ్లే బ్యాంకుల సిబ్బంది రోడ్డుమీద బందోబస్తు పోలీసులు ప్రశ్నిస్తే బ్యాంకు సిబ్బంది తమ ఐడీ కార్డులు చూపించాల్సి ఉంటుంది.