బీహార్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో జూన్ 1 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సీఎం నితీష్ కుమార్ ఇవాళ(సోమవారం) ప్రకటించారు. లాక్‌డౌన్ మంచి ఫలితాలను ఇస్తోందని.. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. ఈ నెల 25న గతంలో ప్రకటించిన లాక్‌డౌన్ గడువు ముగియనుండటంతో.. మరో వారం పాటు దీన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర మంత్రి వర్గం, అధికారులతో చేపట్టిన సమావేశం తర్వాత ఈ నిర్ణయంతీసుకున్ట్లు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు సీఎం నితీష్ కుమార్.
