తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో లాక్‌డౌన్ కొనసాగించాలి అని చెప్పింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా.. ఈ నెల 25 న మరోసారి సమావేశమై లాక్‌డౌన్‌పై చర్చించాలని కోర్టు నిర్ణయించింది.
