
ఖమ్మం జిల్లా: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతుండటంతో మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఖమ్మంలో ఒకే కుటుంబంలో 5 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో జిల్లా లో నో ఎంట్రీ, నో ఎగ్జిట్ విధానాన్ని పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ పాటించాలని చెబుతున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.