పొల్యూషన్‌‌‌‌‌‌‌‌ నుంచి కాపాడుకోవడానికి లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌?

పొల్యూషన్‌‌‌‌‌‌‌‌ నుంచి కాపాడుకోవడానికి లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌?

తాను కూర్చున్న చెట్టును తానే నరికేస్తున్నట్టు.. తన ప్రాణానికి ఆధారమైన పర్యావరణాన్ని తానే నాశనం చేస్తున్నాడు మనిషి. ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో ఎన్నో తప్పులు చేస్తున్నాడు. ఆ తప్పుకు త్వరలోనే భారీ మూల్యం చెల్లించక తప్పదు. మనుషులు చేస్తున్న కొన్ని పనుల వల్ల చాలా దేశాల్లో ఊహించని ప్రళయాలెన్నో ముంచుకొస్తున్నాయి. మరి కొన్నేళ్లలో మనిషి మనుగడకే ముప్పు వచ్చే ప్రమాదముంది. అయితే.. కొన్ని దేశాలతో పోలిస్తే మన దేశంలో ఇప్పుడు కాస్త మెరుగైన పరిస్థితులు ఉన్నాయి. కానీ.. కలుషిత పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం మన దేశమూ ప్రమాదపు అంచులకు చేరక మానదు.

దాహమేసినప్పుడు వాటర్ బాటిల్‌‌‌‌‌‌‌‌ కొంటారు. నీళ్లు తాగి ఖాళీ బాటిల్‌‌‌‌‌‌‌‌ రోడ్డు పక్కన పారేస్తారు.  ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ కవర్లలో సరుకులు తెచ్చుకుంటారు. ఇంటికొచ్చాక కవర్లను చెత్త బుట్టలో పారేస్తారు. ఇంటి పక్కన ఉండే కిరాణ కొట్టుకు వెళ్లాలన్నా వెహికల్‌‌‌‌‌‌‌‌ తీయాల్సిందే! పొగను గాల్లోకి వదలాల్సిందే! ఈ చిన్న చిన్న పనులే ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. ఎన్నో రకాల జీవులు చనిపోవడానికి కారణమవుతున్నాయని ఎంతమందికి తెలుసు? పైగా ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరూ ‘‘నా ఒక్కడి వల్లే ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్ నాశనం అవుతుందా?” అని దబాయించి మరీ అడుగుతారు. మనం చేసే పనుల వల్ల ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఎండాకాలాల్లో గతంలో కంటే ఎక్కువ టెంపరేచర్​ రికార్డవుతోంది. చలికాలాల్లో  ఎన్నడూ లేనంత తక్కువ టెంపరేచర్​ ఉంటోంది. ఇక వర్షాకాలంలో వరదలు ముంచేస్తున్నాయి. రోజురోజుకీ మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు నదుల్లో మంచినీళ్లు పారేవి. అలాంటిది ఇప్పుడు ఫ్యాక్టరీల నుంచి వచ్చే వేస్ట్ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నిండిపోయాయి. సరస్సులు ఎడారిగా మారుతున్నాయి. కనీసం పీల్చడానికి స్వచ్ఛమైన గాలి కూడా లేకుండాపోతోంది. అనేక రకాల జీవ జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. దీనంతటికీ మనమే కారణం. 

మనవల్లే కరువులు, వరదలు వాతావరణ కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వీటివల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు రిస్క్‌‌‌‌‌‌‌‌లో పడిపోయాయి. తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నాయి. కరువుకాటకాలతో విలవిల్లాడుతున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ పెద్ద సమస్యగా మారింది. డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పేరుతో మనిషి చేసే ఎన్నో పనులు పొల్యూషన్‌‌‌‌‌‌‌‌కి కారణమవుతున్నాయి. వాటిలో కొన్ని తప్పక చేసే పనులైతే మరికొన్ని స్వార్ధం వల్ల చేస్తున్నాడు. ఏదేమైనా, కొన్నేళ్లుగా ఎర్త్‌‌‌‌‌‌‌‌పై ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ పడుతూనే ఉంది. భూమి టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏ యేటికాయేడు పెరిగిపోతూనే ఉంది.

గ్లోబల్ వార్మింగ్‌‌‌‌‌‌‌‌ 
ప్రస్తుతం ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు గ్లోబల్‌‌‌‌‌‌‌‌ వార్మింగ్‌‌‌‌‌‌‌‌ పెద్ద సమస్యగా మారింది. అయితే... ఇదివరకు కూడా ఈ సమస్య ఉన్నా 20వ శతాబ్దం నుంచే బాగా పెరుగుతోంది. అడవులను నరకడం, కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి గ్రీన్‌‌‌‌‌‌‌‌హౌస్ గ్యాస్‌‌‌‌‌‌‌‌లను గాలిలోకి వదలడం వల్ల గ్లోబల్‌‌‌‌‌‌‌‌ వార్మింగ్‌‌‌‌‌‌‌‌ వేగంగా పెరుగుతోంది. దీని ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌తో సముద్ర మట్టాలు పెరగడంతోపాటు వేడి గాలులు వీయడం, ఎడారులు పెరగడం, అడవులు తగలబడిపోవడం లాంటివి జరుగుతున్నాయి. సముద్ర మట్టాలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లోని చాలా ఊళ్లను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
గ్లోబల్‌‌‌‌‌‌‌‌ వార్మింగ్‌‌‌‌‌‌‌‌ని తగ్గించడంలో అడవులు ఎఫెక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తాయి. కానీ.. వాటిని కాపాడడంలో మనిషి ఫెయిల్‌‌‌‌‌‌‌‌ అవుతన్నాడు. కొన్ని దశాబ్దాలుగా అమెజాన్ రెయిన్‌‌‌‌‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌లో -ఫార్మింగ్, పశువులను మేపడం, రోడ్లు వేయడం, మంటలు చెలరేగడం.. లాంటి అనేక కారణాల వల్ల ఇరవై శాతం వరకు మాయమైంది. మన దేశంలో కూడా కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు లేకపోలేదు. కాకపోతే కొన్ని పొల్యూటెడ్‌‌‌‌‌‌‌‌ దేశాలతో పోలిస్తే మనం కొంత మెరుగైన స్థితిలో ఉన్నామని ఓ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌లో తేలింది. 

జర్మనీలోని రుహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనిర్సిటీ ప్రతి సంవత్సరం సర్వే చేసి గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రికార్డు చేస్తుంది. భూకంపాలు, సునామీలు, తుపానులు, వరదలు, కరువులు, ఉష్ణోగ్రతలు పెరగడం ఆధారంగా ఈ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తయారుచేస్తారు. ఇందులో ప్రమాద పరిస్థితులను శాతాల్లో లెక్కిస్తారు. మొత్తం 181 దేశాల మీద చేసిన ఈ సర్వేలో మన దేశ రిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6.65 శాతంతో 90వ స్థానంలో నిలిచింది. ఇక ప్రమాదకర పరిస్థితుల ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 12.52 శాతంగా ఉంది. రిస్క్​లో ఉన్నవారి సంఖ్య 53.9 శాతంగా ఉంది. ఈ లెక్కన ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే మనం కాస్త బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అయినప్పటికీ మన దేశంలోని ప్రస్తుత పరిస్థితులు మారకపోతే మరి కొన్నేళ్లలో మనమూ రిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడటం ఖాయమంటున్నారు ఎకాలజిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు. వరల్డ్ రిస్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 47.73 శాతంతో వనౌటు ఎక్కువ రిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఖతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అతి తక్కువ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 0.30 శాతంతో ఉంది. 

మన పరిస్థితి 
మనదేశంలో అనుకోకుండా భారీ వర్షాలు, వరదలు రావడం మామూలే. దాంతో మనం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే.. ఈ పరిస్థితులను పట్టణాలు కాస్త మెరుగ్గా ఎదుర్కొంటున్నప్పటికీ గ్రామాల్లో మాత్రం రిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్త ఎక్కువగానే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో విపత్తులు వచ్చినప్పుడు వాటినుంచి బయటపడేందుకు చేసే ఖర్చు చాలా తక్కువ. మన దేశంలో దాదాపు 66శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. కానీ.. గ్రామాల్లో కనీస వసతులు, సోషల్ సర్వీసులు పెద్దగా అందడంలేదు. ఇక యువతలో 23 శాతానికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం దేశంలో అందరికీ పోషకాహారం అందడంలేదు. ఇలా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మనదేశంలో పర్యావరణ విపత్తులు కూడా పెరిగితే ఆ పరిస్థితిని ఎదుర్కోవడం చాలా కష్టం. అందుకే ఇప్పటినుంచైనా జాగ్రత్త పడాలి అంటున్నారు ఎక్స్​పర్ట్స్.  

కరోనా మొదటి వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రకృతి పరిస్థితి కాస్త మెరుగుపడింది. కానీ.. రెండో వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత అంతా మామూలైపోయింది. ఫ్యాక్టరీలు తెరిచారు. జనాలు ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు.  మళ్లీ వెనకటి రోజులు వచ్చాయి. పచ్చని చెట్లు మళ్లీ మోడుబారడం మొదలైంది. నదుల్లో కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిండుతున్నాయి. సముద్రాల్లో ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెత్త పేరుకుపోతోంది. రోడ్ల మీద రయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. రయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. మంటూ పొగ వదులుతూ లక్షలాది వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరుగుతున్నాయి. గాలి, నీళ్లు కలుషితం అవుతూనే ఉన్నాయి. దీంతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా పెరుగుతూనే ఉంది. ఇవేకాదు... ప్రస్తుతం మన దేశాన్ని వెంటాడుతున్న పర్యావరణ సమస్యలు చాలానే ఉన్నాయి. 

క్లైమెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
వాతావరణంలో మార్పుల వల్ల భూమి రోజురోజుకీ వేడెక్కుతోంది. ప్రతి సంవత్సరం రికార్డయ్యే సగటు టెంపరేచర్​  ఆధారంగా 2020ని ఎనిమిదో వార్మెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గుర్తించారు. ఇప్పటివరకు మన దేశంలో అతి ఎక్కువ టెంపరేచర్​ రికార్డయిన సంవత్సరం 2016. దాని తర్వాత స్థానంలో 2009 ఉంది. ఇప్పటివరకు రికార్డయిన టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదిహేను వార్మెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 12 వరకు. 2006 నుంచి 2020ల మధ్యనే ఉన్నాయి. పైగా వార్మెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశాబ్దంగా 2011–-20ని గుర్తించారు సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు. ఈ లెక్కలు చూస్తేనే తెలుస్తుంది.. మనం ఎంత ప్రమాద పరిస్థితులను కొని తెచ్చుకుంటున్నామనేది. ఈ మధ్య కాలంలో గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంతలా పెరుగుతోందో ఈ లెక్కలు చూస్తే క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెలుస్తోంది. ఇది ఇండియాకు ఒక వార్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటిది. 2020లో సగటు టెంపరేచర్​25.78 డిగ్రీల సెల్సియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డయింది. అన్ని సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో భూమి వేడెక్కుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డేటా ద్వారా తెలుస్తోంది. సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైన్స్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ) ప్రకారం.. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఒడిశా, ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్లైమెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉంటోంది. అంతేకాదు ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువమంది పేదలు ఉన్నట్టు స్టడీ గుర్తించింది. 

క్లైమెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి అనేక కారణాలు ఉన్నప్పటికీ మనిషి చేసే తప్పులే ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటర్నల్ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మానిటరింగ్ సెంటర్ (ఐడీఎంసీ) ప్రకారం.. క్లైమెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల దెబ్బతింటున్న దేశాల జాబితాలో ఇప్పటికే మన దేశం చేరింది. మనదేశం పోయినేడు, ఈ సంవత్సరంలో అనేక వరదలు, తుపానుల వంటి విపత్తులను ఎదుర్కొంది. పరిస్థితుల్లో మార్పులు రాకపోతే భవిష్యత్తులో భూకంపాలు, సునామీలు, కరువులు ఊహించలేనంతగా పెరిగే ప్రమాదం ఉంది. 2011–-2020 మధ్య 33 తుపానులు వచ్చాయి.  ఇంతలా తుపానులు రావడం 1971 నుంచి ఈ పదేళ్లలోనే ఎక్కువ. వాతావరణ పరిస్థితుల కారణంగా2008, 2020ల మధ్య సంవత్సరానికి సగటున 37 లక్షల మంది ప్రజలు నివాస ప్రాంతాలను ఖాళీ చేసి, వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. 

వ్యవసాయానికి ముప్పు
వ్యవసాయ రంగం కూడా పర్యావరణ మార్పులకు కారణమవుతోంది. దాంతో రైతులపై ప్రకృతి కక్షగట్టినట్టు పంటలకు ఆటంకాలు కలిగిస్తోంది. ఎవరి కన్ను వాళ్ల వేలితోనే పొడుచుకున్నట్టు మారింది పరిస్థితి. పెరుగుతున్న పురుగు మందుల వాడకం వల్ల నేల, నేల లోపలి నీళ్లు కలుషితం అవుతున్నాయి. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ప్రకారం.. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో వ్యవసాయం ఎక్కువగా చేస్తున్న జిల్లాల్లో దాదాపు సగం గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొల్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. అంతేకాదు,  ఈ రాష్ట్రాల్లో భూమి నుంచి ఎక్కువ నీళ్లు లాగేయడం వల్ల గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడుగంటిపోతోంది. మిషిగాన్ యూనివర్సిటీ చేసిన ఒక రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గడం వల్ల హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో 2025 నాటికి 20 శాతం పంట దిగుబడులు తగ్గుతాయని తేలింది. 
వ్యవసాయంపై క్లైమెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేంజెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పష్టంగా కనిపిస్తోంది. వడగళ్ళు, తుపానులు కూడా రైతుల చావులకు కారణమవుతున్నాయని కొన్ని స్టడీలు చెబుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం.. వాతావరణం సహకరించకపోవడం వల్ల సాగులో నష్టాలొచ్చి 2018లో 5,763 మంది,2019లో 5,957 మంది ఆత్మహత్య చేసుకున్నారు.

పొల్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొంతవరకు ఆపొచ్చనే ఉద్దేశంతో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అందుకోసం స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఒక మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టింది. అయినా.. దేశంలోని 140 మిలియన్ హెక్టార్ల పొలాల్లో కేవలం రెండు శాతం భూమిలో మాత్రమే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు రైతులు. సేంద్రియ వ్యవసాయంలో సిక్కిం మొదటి స్థానంలో ఉంది. అండమాన్– నికోబార్ దీవుల్లో దాదాపు 60 శాతం భూముల్లో ఆర్గానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పద్ధతుల్లో పండిస్తున్నారు. వ్యవసాయ సంపన్న రాష్ట్రమైన పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం కేవలం 0.4శాతం మాత్రమే ఆర్గానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగు ఉంది. హర్యానాలో 0.7శాతం ఆర్గానిక్ ఫార్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. 

80 శాతం నీళ్లు కలుషితం
గ్రౌండ్ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని మినహాయిస్తే.. దేశంలో దాదాపు 80శాతం నీళ్లు కలుషితమయ్యాయి. చాలా ప్రాంతాల్లో నీటి వనరులు తగ్గిపోతున్నాయి. ‘మైనర్ ఇరిగేషన్ సెన్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ప్రకారం.. 2001–2006 మధ్య కేవలం ఐదు సంవత్సరాల్లోనే వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుమారు 8శాతం తగ్గాయి. వాటర్ క్వాలిటీ తక్కువగా ఉండడం వల్ల మరో పది శాతం వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిపోతున్నాయి. ఇప్పటికీ ఆ పరిస్థితుల్లో పెద్దగా మార్పులు రాలేదు. దేశంలోని జనాభాలో సగం కంటే తక్కువ మంది మాత్రమే కలుషితం కాని మంచినీళ్లని తాగుతున్నారు. అందుకే 2024 నాటికి ప్రతి ఇంటికి మంచినీళ్లను అందించాలనే లక్ష్యంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పని చేస్తోంది.

ఇక నదుల విషయానికి వస్తే లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల నదులన్నీ పరిశుభ్రంగా మారాయనే వార్త అప్పట్లో సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో చెక్కర్లు కొట్టింది. కానీ.. నదుల నీళ్ల క్వాలిటీలో చెప్పుకోదగిన మార్పులు రాలేదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపింది. కాకపోతే లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్ టైంలో దేశంలోని 19 నదుల్లో మాత్రం నీళ్ల క్వాలిటీ కాస్త మెరుగైంది. గంగా, యమునా, గోదావరిలో నీళ్ల క్వాలిటీని పెంచేందుకు గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితాలు రాలేదు. 

గాలి 
‘ద లాన్సెట్’ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం... 2019లో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొల్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6.67 మిలియన్ల మంది చనిపోయారు. అందులో 1.67 మిలియన్ల మంది ఇండియాలోనే చనిపోయారు. మన తర్వాత చైనాలో ఎక్కువమంది చనిపోయారు. సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం గత దశాబ్దంలో పర్టిక్యులేట్ మ్యాటర్(గాలిలోని విషపూరిత పార్టికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) వల్ల చనిపోయేవాళ్ల సంఖ్య 2.5  రెట్లు పెరిగింది. కొన్నేళ్లుగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొల్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  గాలి ఎక్కువగా కలుషితమవుతోంది. ఇప్పుడు ఢిల్లీని ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొల్యూషన్ హడలెత్తిస్తోంది. పొగ మంచు కమ్మేయడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈ మధ్యే 470ని దాటింది. గాలిలో ఈ స్థాయి కాలుష్యం ఉంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవాళ్లపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు ప్రాణాలు పోయే అవకాశమూ ఉంది. అయితే.. దేశవ్యాప్తంగా వంట గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడకం పెరగడం వల్ల కాలుష్యాన్ని కొంత తగ్గించినట్టయింది. రెండు దశాబ్దాల్లో కలపకు బదులుగా వంటగ్యాస్ వాడడం వల్ల హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొల్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 40 శాతం తగ్గింది.

ఫ్యాక్టరీల కాలుష్యం
2019 నుంచి 2021 మధ్య కాలంలో పొల్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పెంచే ఫ్యాక్టరీల సంఖ్య ఎనిమిది శాతం పెరిగింది. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువగా 35శాతం, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 12శాతం ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. పర్యావరణ రక్షణ చట్టం–1986 ప్రకారం గుర్తించిన 429 రకాల కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏది వాడినా ఆ ఫ్యాక్టరీని పొల్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచేదిగా గుర్తిస్తారు. జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకారం... జార్ఖండ్, రాజస్థాన్, ఢిల్లీ, బీహార్, అరుణాచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఫ్యాక్టరీలు పొల్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిగ్గా పాటించడం లేదు. 2017–-18, 2019–-20 సంవత్సరాల్లో ఫ్యాక్టరీల వేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సగటున 7 శాతం  పెరిగింది. 
నిలకడలేదు

ఇండియాలోని చాలా సిటీలు పర్యావరణపరంగా నిలకడ లేనివే. వాటిలో ఉత్పత్తయ్యే మురుగునీటిలో కేవలం 28శాతం నీటిని మాత్రమే నదుల్లో కలిసే ముందు శుద్ధి చేస్తున్నారు. ఆ నీళ్ల నుంచి పర్యావరణానికి హాని కలిగించే వేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తీసేస్తున్నారు. పదిహేనేండ్లలో భారతదేశ మురుగునీటి శుద్ధి కెపాసిటీ 15 శాతం మాత్రమే పెరిగింది. బీహార్, అస్సాంతోపాటు దేశంలోని 10 రాష్ట్రాల్లోని పెద్ద నగరాల్లో మురుగునీటిని శుద్ధి చేయడానికి కావాల్సిన సౌకర్యాలు పెద్దగా లేవు. 

ప్రపంచంలో అనేక రకాల జంతుజాలం ఉన్న దేశాల్లో మనది ఒకటి. కానీ.. ఇప్పుడు బయో డైవర్సిటీ నాశనం అవుతోంది. డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఈ జంతువులు, పక్షులను కోల్పోవలసి వస్తోంది. బయో డైవర్సిటీని కాపాడాలంటే అటవీ ఆరోగ్యాన్ని కాపాడడం చాలా ముఖ్యం. మన దేశంలో గడిచిన కొన్నేళ్లలో అటవీ ఉత్పత్తులు బాగా తగ్గాయి. అటవీ వనరులను అతిగా దోచుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అనేక రకాల జంతువులు, పక్షులు కనుమరుగయ్యే దశలో ఉన్నాయి. 

కార్చిచ్చు
టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరగడం అడవుల్లో మంటలు చెలరేగడానికి కారణం అవుతోంది. ఈ సంవత్సరం విజిబుల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియో మీటర్ సూట్ (వీఐఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) దాదాపు నాలుగు లక్షలకు పైగా ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలెర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. 2016 సంవత్సరం ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డు కావడంతో ఆ సంవత్సరంలో 541,135 ఫారెస్ట్ ఫైర్ అలెర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చాయి. ‘‘గ్లోబల్ ఫారెస్ట్ వాచ్” రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల అడవుల్లో మంటలు చెలరేగుతాయని స్పష్టంగా చెప్పింది. ఈ సంవత్సరం మన దేశంలో ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు 16 రాష్ట్రాల్లోని అడవుల్లో మంటలు చెలరేగాయి. కానీ.. తమిళనాడు, కేరళలో మాత్రం తక్కువసార్లు కార్చిచ్చు చెలరేగింది. 

అడవి జాతులు
భారతదేశంలో దాదాపు 45,000 జాతుల మొక్కలు, 91,000 జాతుల జంతువులు ఉన్నాయి. వాటిలో 1,212  జంతు జాతులను ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్జర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్​ నేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఐయూసీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చింది. వాటిలో 12 శాతానికి పైగా అంతరించిపోయే దశలో ఉన్నాయి. అంతరించిపోతున్న 148 జాతుల్లో 48 క్షీరదాలు, 56 సరీసృపాలు, 23 ఉభయచరాలు ఉన్నాయి. ప్రపంచంలోని టాప్ 35 బయోడైవర్సిటీ హాట్ స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో భారతదేశంలో నాలుగు ఉన్నాయి. అవే పశ్చిమ కనుమలు, హిమాలయాలు, సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బన్స్, ఇండో--– బర్మా ప్రాంతం. ఈ హాట్ స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోని వృక్షసంపద 40 ఏళ్లలో 50 శాతం వరకు తగ్గింది. 

ఎనర్జీ
ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కాపాడాలనే ఉద్దేశంతో మనదేశం రెన్యూవబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనర్జీకి మారడానికి ప్రయత్నిస్తోంది. అందుకోసం కొన్ని లక్ష్యాలను కూడా పెట్టుకుంది. సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెపాసిటీ 35శాతం, విండ్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెపాసిటీ 69 శాతం పెంచాలనే లక్ష్యాలను చేరుకోలేకపోయింది. గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 39 సోలార్ పార్కులను డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని నిర్ణయించింది. కానీ.. వాటిలో ఒక్కటి కూడా పూర్తిగా ఏర్పాటు కాలేదు. ఇండియాలో ఎక్కువగా బొగ్గును మండించి ఎలక్ట్రిసిటీని అంటే థర్మల్​ పవర్​ను ప్రొడ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. దీనివల్ల సహజ వనరులు తగ్గడంతోపాటు బొగ్గు వల్ల ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పొల్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతోంది. మన దేశం మరో 30 సంవత్సరాల వరకు కూడా బొగ్గుపైనే ఆధారపడే అవకాశముంది. బొగ్గు వినియోగాన్ని దశలవారీగా తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. లేదంటే భవిష్యత్తులో మరిన్ని విపత్తులు చూడాల్సిందే. 

పెరుగుతున్న జనాభా
దేశంలో జనాభా పెరగడం కూడా పెద్ద సమస్యగా మారింది. జనం సంఖ్య పెరగడంతో అవసరాల కోసం అడవులు నరుకుతున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 2.11 శాతం జనాభా పెరిగి. దానివల్ల న్యాచురల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిసోర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడకం పెరిగి, డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గుతుంది. కాబట్టి జనాభా పెరుగుదలను తగ్గించడం మన ముందున్న పెద్ద సవాల్. 

పేదరికం
మన దేశాన్ని తరతరాలుగా పేద ప్రజలున్న ధనిక భూమిగా పిలుస్తున్నారు. మన దగ్గర ఎన్నో వనరులున్నా ఎంతోమంది మాత్రం కొన్ని కారణాల వల్ల పేదవాళ్లుగానే మిగిలిపోతున్నారు. ప్రజల్లో ఎక్కువమంది తిండి, కనీస వసతుల కోసం ప్రకృతి మీదనే ఆధారపడాల్సివస్తోంది. దానివల్ల వనరులు కరిగి ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీద ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడుతోంది. 

టాప్ 10లో మనం
కాప్‌‌‌‌‌‌‌‌26 మీట్‌‌‌‌‌‌‌‌లో ‘జర్మన్‌‌‌‌‌‌‌‌వాచ్’ విడుదల చేసిన గ్లోబల్ క్లైమెట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (సీసీపీఐ)లో మన దేశం పదో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. అయితే.. ఈ ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌ మూడు ప్లేసుల అర్హత ఏ దేశానికీ దక్కలేదు. ఏ దేశమూ ఊహించినంత పనితీరు కనబరచలేదని రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో తెలిపింది జర్మన్‌‌‌‌‌‌‌‌వాచ్‌‌‌‌‌‌‌‌. అందువల్ల మొదటి మూడు ప్లేస్‌‌‌‌‌‌‌‌లు ఖాళీగా ఉన్నాయి. నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో డెన్మార్క్  ఉంది. అంటే ఉన్నవాటిలో అదే టాప్‌‌‌‌‌‌‌‌. అంటే మనది ఏడో స్థానంలో ఉందన్నమాట. చైనా 37వ స్థానంలో ఉంది. ఇది గత సంవత్సరం 33వ స్థానంలో ఉంది. 

లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ తప్పదా? 
అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నాం. కానీ.. ఇప్పుడు పొల్యూషన్‌‌‌‌‌‌‌‌ నుంచి కాపాడుకోవడానికి కూడా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ పెట్టుకునే రోజులు వచ్చేలా ఉన్నాయి. ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డేంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెల్స్ గురించి గవర్నమెంట్లు, ఎన్జీవోలు అవగాహన కల్పిస్తూనే ఉన్నా చాలామంది రెస్పాన్సిబిల్​గా ఉండడంలేదు. అందుకే పొల్యూషన్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఢిల్లీ ప్రజలను కొన్నాళ్ల నుంచి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొల్యూషన్‌‌‌‌‌‌‌‌ వేధిస్తోంది. దాంతో సుప్రీం కోర్టు ఢిల్లీ పొల్యూషన్‌‌‌‌‌‌‌‌పై వచ్చిన పిటిషన్‌‌‌‌‌‌‌‌పై విచారణలో భాగంగా... ‘‘ఇలాంటి వాతావరణంలో ప్రజలెలా బతుకుతారని గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించింది. అవసరమైతే రెండు రోజులు లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ పెట్టే విషయంపై ఆలోచించాల’’ని చెప్పింది సుప్రీం. భవిష్యత్తులో పొల్యూషన్‌‌‌‌‌‌‌‌ పెరగడం వల్ల లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లు పెట్టినా ఆశ్చర్యం లేదు. 

‘క్లైమెట్‌‌‌‌‌‌‌‌ చేంజ్’ పేషెంట్‌‌‌‌‌‌‌‌
ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పొల్యూషన్‌‌‌‌‌‌‌‌ అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారు. ముఖ్యంగా క్లైమెట్‌‌‌‌‌‌‌‌ చేంజెస్‌‌‌‌‌‌‌‌ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వెళ్తే డాక్టర్లు డిసీజ్‌‌‌‌‌‌‌‌ను గుర్తించి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ చేస్తారు. రికార్డుల్లో డిసీజ్‌‌‌‌‌‌‌‌ గురించి రాస్తారు. కానీ.. కెనడాలో ఒక డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోగి సమస్యను ‘క్లైమెట్‌‌‌‌‌‌‌‌ చేంజ్‌‌‌‌‌‌‌‌’గా రాశాడు. ఇలా క్లైమెట్‌‌‌‌‌‌‌‌ చేంజ్‌‌‌‌‌‌‌‌ను సమస్యగా గుర్తించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి.  ప్రస్తుతం ఇది ప్రపంచంలో హాట్‌‌‌‌‌‌‌‌ టాపిక్​గా మారింది.

కెనడాలోని బ్రిటిష్‌‌‌‌‌‌‌‌ కొలంబియా ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లో ఒక హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు 70 ఏళ్ల మహిళ వచ్చింది. ఆమె ఉబ్బసంతో శ్వాస తీసుకోవడానికి తెగ ఇబ్బంది పడుతుంది. ఉబ్బసం అంతలా పెరగడానికి కారణం.. వాతావరణంలో మార్పులు. ఈ మధ్య ఆ ప్రాంతంలో వేడిగాలులు ఎక్కువగా వీస్తుండడం వల్ల చాలా మంది ఇలానే బాధపడుతున్నారు. వేడి గాలుల వల్లే ఆమెకు ఉబ్బసం పెరిగింది. ఆ వేడి గాలులకు కారణం బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లోని కూటెనేస్ ప్రాంతంలో అడవిలో మంటలు చెలరేగడమే. దానికి కారణం క్లైమెట్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన చేంజెస్‌‌‌‌‌‌‌‌. అందుకే డాక్టర్‌‌‌‌‌‌‌‌ మెరిట్‌‌‌‌‌‌‌‌ ‘‘క్లైమెట్‌‌‌‌‌‌‌‌ చేంజ్‌‌‌‌‌‌‌‌” సమస్యతో ఆమె బాధపడుతున్నట్టు కన్ఫర్మ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. గత జూన్ నెలలో కెనడాలో ​రికార్డులను బద్ధలు కొట్టిన హీట్ వేవ్‌‌‌‌‌‌‌‌లో వందలాది మంది చనిపోయారు.

కాప్ 26 
వాతావరణ మార్పులపై యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో ప్రతియేడు ఈ సదస్సు జరుగుతుంది. 1994 మార్చి 21న మొదటిసారి జరిగింది. ఇప్పటి వరకు 25 సమావేశాలు జరిగాయి. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి 12 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో సిటీలో ఈ సదస్సు జరిగింది. ఎన్విరాన్‌మెంట్‌పై ఎఫెక్ట్‌ పడే పనుల్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ సదస్సులు నిర్ణయాలు తీసుకుంటారు. ఈసారి ఏడు నిర్ణయాలు తీసుకున్నారు అవి.. 

ఇంధనాల వాడకం: పెట్రోలియం, గ్యాస్, బొగ్గు లాంటి ఇంధనాలను మండించడం వల్ల టెంపరేచర్‌‌ పెరుగుతోంది. భూతాపం ఇంకాస్త పెరిగితే ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే బొగ్గు ఎక్కువగా వాడే దేశాలు వాడకాన్ని తగ్గించే ఒప్పందంపై సంతకాలు చేశాయి. కానీ.. దీన్ని కొన్ని దేశాలు ఒప్పుకోలేదు. 
మిథేన్: పెట్రోలియంను తీసేటప్పుడు న్యాచురల్‌ గ్యాస్‌ నుంచి మిథేన్ విడుదల అవుతుంది. కొత్త టెక్నాలజీ వాడి దీన్ని తగ్గించవచ్చు. మిథెన్‌ను రిలీజ్‌ చేసే పెద్ద పెద్ద చెత్త డంపులను  తగ్గించాలని చేసిన ఒప్పందంపై దాదాపు 100 దేశాలు సంతకం చేశాయి. 
సోలార్‌‌ విద్యుత్‌:  బొగ్గు, గ్యాస్‌ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్‌ చేసే పద్ధతుల నుంచి సోలార్‌‌, విండ్‌ పవర్‌‌ వైపు మళ్లాలి. 2050 కల్లా విండ్‌ పవర్‌‌, సోలార్‌‌ పవర్‌‌ను ఎక్కువగా పెంచుకోవాలి. 
పెట్రోల్, డీజిల్: పెట్రోల్, డీజిల్ కార్లను పూర్తిగా వాడడం మానేయాలి. హైడ్రోజన్‌తో నడిచే ట్రక్కులు, బస్సులు అందుబాటులోకి తీసుకురావాలి. 
చెట్లు నాటాలి: గ్లోబల్‌ వార్మింగ్‌ని1.5 డిగ్రీ క్లైమేట్‌ చేంజ్‌ పాయింట్ల కంటే పెరగకుండా జాగ్రత్త పడాలి.  అంటే కార్బన్ డయాక్సైడ్‌ తగ్గించుకోవాలి. అందుకోసం చెట్లు పెంచాలని కాప్‌ 26లో నిర్ణయించారు. 
గ్రీన్‌హౌస్:  వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను ఆర్టిఫియల్‌గా తొలగించే ప్రయత్నాలు చేయాలి. కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకునేందుకు టెక్సాస్‌లో కార్బన్ ఇంజినీరింగ్, స్విట్జర్లాండ్‌లో క్లైమ్‌వర్క్స్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలాంటివి కార్బన్‌డయాక్సైడ్‌ ప్రొడ్యూస్‌ చేసే చోట్ల పెట్టాలి. 
పేద దేశాలకు ఆర్థిక సాయం: 2009లో కోపెన్‌హగన్‌లో జరిగిన కాప్ సదస్సులో ధనిక దేశాలన్నీ పేద దేశాలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పాయి. కానీ.. అనుకున్నంతగా సాయం చేయలేదు. కాబట్టి 2023 నాటికి ఆ సాయం చేయాలి.

తువాలు మంత్రి ప్రయత్నం 
తువాలు ఒక చిన్న  ఐలాండ్‌‌‌‌‌‌‌‌. గ్లోబల్ వార్మింగ్‌‌‌‌‌‌‌‌ పెరిగితే.. మంచు కరిగి, సముద్ర మట్టం పెరిగి ఆ దేశం నామరూపాల్లేకుండా పోతుంది. ఆ విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఆ దేశ మంత్రి సైమన్‌‌‌‌‌‌‌‌ కోఫ్‌‌‌‌‌‌‌‌ వెరైటీ ప్రయత్నం చేశాడు. ఈ మధ్య క్లైమెట్‌‌‌‌‌‌‌‌ చేంజ్‌‌‌‌‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ ఆఫ్​ ద పార్టీస్‌‌‌‌‌‌‌‌–26 (కాప్‌‌‌‌‌‌‌‌26) మీటింగ్స్‌‌‌‌‌‌‌‌ జరిగాయి. ఈ సందర్భంగా అన్ని దేశాలకు కాలుష్య ప్రభావం గురించి తెలిసేలా చేయాలనుకున్నాడు సైమన్‌‌‌‌‌‌‌‌. అందుకే వెరైటీగా మోకాళ్ళ లోతు నీళ్లలో దిగి స్పీచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. అంటే గ్లోబల్‌‌‌‌‌‌‌‌ వార్మింగ్‌‌‌‌‌‌‌‌ పెరిగితే మనం ఇలా నీళ్లలో బతకాల్సి వస్తుందనే మెసేజ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. ఆ వీడియోను కాప్‌‌‌‌‌‌‌‌–26కి పంపాడు. పైగా ఆ దేశంలోని టీవీ చానెల్‌‌‌‌‌‌‌‌లో కూడా టెలికాస్ట్‌‌‌‌‌‌‌‌ అయింది. దాంతో సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌గా మారింది. కాలుష్య ప్రభావాన్ని అన్ని దేశాలకు తెలిసేలా చేసేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని అని చెప్పాడాయన. పొల్యూషన్ వల్ల సముద్ర మట్టాలు త్వరగా పెరిగిపోతున్నందున కొన్నాళ్ల తర్వాత సమావేశాలు ఇలానే జరుపుకోవాల్సి వస్తుందనేది ఆయన భావం. ఇప్పటికైనా అన్ని దేశాలు దీనిపై సీరియస్‌‌‌‌‌‌‌‌గా పని చేయాలని అన్ని దేశాలకు రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశాడు.  


::: కరుణాకర్​ మానెగాళ్ల